గోంగూర, మామిడి పచ్చడి సహా.. పుతిన్ కోసం అధికారిక విందులో పసందైన వంటకాలు!

స్వాగతం మొదలు.. వీడ్కోలు వరకు ప్రతి ఫ్రేమ్‌ అదుర్స్‌. గ్రాండ్‌ వెల్కమ్‌.. రాష్ట్రపతి భవన్‌లో పసందైన విందు.. హైదరాబాద్‌ హౌస్‌లో దౌత్య చర్చలు.. ప్రతి ఫ్రేమ్‌లో పుతిన్‌ - మోదీ స్నేహబంధం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి చర్చకు దారి తీశాయి. పుతిన్‌ పర్యటనతో భారత్‌ - రష్యా దౌత్య బంధం మరింత దృఢపడింది. రష్యా అధ్యక్షులు పుతిన్ 10 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఇది ఆయన 11వ పర్యటన.

గోంగూర, మామిడి పచ్చడి సహా.. పుతిన్ కోసం అధికారిక విందులో పసందైన వంటకాలు!
Putin At State Dinner Hosted By President Droupadi Murmu

Updated on: Dec 06, 2025 | 7:54 AM

స్వాగతం మొదలు.. వీడ్కోలు వరకు ప్రతి ఫ్రేమ్‌ అదుర్స్‌. గ్రాండ్‌ వెల్కమ్‌.. రాష్ట్రపతి భవన్‌లో పసందైన విందు.. హైదరాబాద్‌ హౌస్‌లో దౌత్య చర్చలు.. ప్రతి ఫ్రేమ్‌లో పుతిన్‌ – మోదీ స్నేహబంధం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారాయి చర్చకు దారి తీశాయి. పుతిన్‌ పర్యటనతో భారత్‌ – రష్యా దౌత్య బంధం మరింత దృఢపడింది.

రష్యా అధ్యక్షులు పుతిన్ 10 సార్లు భారతదేశాన్ని సందర్శించారు. ఇది ఆయన 11వ పర్యటన. పుతిన్ తన ఫిట్‌నెస్, జీవనశైలి కోసం వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఆహారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్యకరమైన ఆహారం ఉంటుంది. కానీ పుతిన్ ప్రతి ఇంట్లో తినే అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ వంటకాన్ని చాలా ఇష్టపడతారు. అవును, ఈ వంటకం దలియా, దీనిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో విస్తృతమైన వంటకాల వడ్డించారు.

శుక్రవారం (డిసెంబర్ 5) రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యం ఇచ్చారు. ప్రాంతీయ రుచులు, కాలానుగుణ ఉత్పత్తులు, సాంప్రదాయ వంట పద్ధతులను తెలియజేస్తూ ప్రత్యేకంగా రూపొందించిన భారతీయ థాలీని ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ వంటి ముఖ్య ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పుతిన్‌కు వడ్డించిన వంటకాల్లో శాఖాహార మెనూ మురుంగెలై చారుతో ప్రారంభమైంది. ఇది మునగ ఆకులు, పెసరపప్పుల సున్నితమైన మసాలా రసం, తరువాత మూడు ఆకలి పుట్టించే వంటకాలు.. గుచ్చి డూన్ చెటిన్ (వాల్‌నట్ చట్నీతో కాశ్మీరీ మోరల్స్ తో కూడినది), పుదీనా సాస్ , షీర్మల్‌తో కాలే చనే కే శికంపురి కబాబ్‌లు, పెల్మేని- కూరగాయల జోల్ మోమోలు ఉన్నాయి. ప్రధాన వంటకంగా, అతిథులకు కుంకుమపువ్వు సాస్‌లో జఫ్రానీ పన్నీర్ రోల్, పాలక్ మేథి మట్టర్ కా సాగ్, తందూరీ భర్వాన్ ఆలూ, ఆచారి బైంగన్, ఎల్లో దాల్ తడ్కా, డ్రై-ఫ్రూట్ కుంకుమపువ్వు పులావ్, లచ్చా పరాఠా, మిస్సి రోటీ, మగజ్ నాన్ వంటి వివిధ రకాల భారతీయ బ్రెడ్‌లతో వడ్డించారు. డెజర్ట్ స్ప్రెడ్‌లో బాదం కా హల్వా, కేసర్-పిస్తా కుల్ఫీలతో పాటు తాజా పండ్లు ఉన్నాయి. టేబుల్‌పై సలాడ్‌లు, మురుక్కు, గుర్ సందేశ్ వంటి సాంప్రదాయ స్నాక్స్, గోంగూర ఊరగాయ, మామిడి చట్నీ వంటి మసాలా దినుసులు కూడా అందించారు. పానీయాల ఎంపికలలో దానిమ్మ, నారింజ, క్యారెట్-అల్లం, బీట్‌రూట్ వంటి పళ్ల రసాలు ఏర్పాటు చేశారు.

Lavish Thali Served At State Dinner For Putin

ఇక, సాయంత్రం సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. రాష్ట్రపతి భవన్ నావల్ బ్యాండ్ సరోద్, సారంగి, తబలా కళాకారుల సహకారంతో “మెస్సినల్ లవ్” అనే ప్రత్యేక ఇండో-రష్యన్ సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఈ సెట్‌లిస్ట్ భారతీయ శాస్త్రీయ రాగాలను రష్యన్ శ్రావ్యతలతో మిళితం చేశారు. రాగ్ అమృతవర్షిణి, రాగ్ ఖమాజ్‌తో ప్రారంభమై, తరువాత రష్యన్ జానపద క్లాసిక్ కాలింకా ప్రదర్శించడం జరిగింది. రాగ్ యమన్, రాగ్ శివరంజిని, రాగ్ నళినాకాంతి ప్రదర్శనలు హిందీ అభిమాన ప్రదర్శన ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీతో కలిసి సాగాయి. ఈ కార్యక్రమంలో ది నట్‌క్రాకర్ సూట్ నుండి ఒక సారాంశాన్ని చైకోవీస్కీకి సమర్పించి, రాగ్ భైరవి మరియు రాగ్ దేశ్‌లతో ముగించారు. అధ్యక్షుడు పుతిన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుండి రష్యాకు బయలుదేరారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలు పలికారు. ఇది భారతదేశం-రష్యా దౌత్యపరమైన సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసిన రెండు రోజుల పర్యటన ముగింపును సూచిస్తుంది.

ఇదిలావుంటే, రాష్ట్రపతి భవన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గౌరవార్ధం ఏర్పాటు చేసిన అధికారిక విందుపై వివాదంపై రాజుకుంది. విపక్ష నేత రాహుల్‌గాంధీ , కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు ఆహ్వానం అందకపోవడంపై వివాదం విపక్షాలు మండిపడుతున్నాయి. విచిత్రంగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథూరూర్‌ మాత్రం రాష్ట్రపతి భవన్‌లో విందుకు హాజరయ్యారు. రాహుల్‌,ఖర్గేకు కాకుండా శశిథరూర్‌ను విందుకు ఆహ్వానించడంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధినేతకు అవమానం జరుగుతున్నప్పుడు ఆ కుట్రలో థరూర్ భాగం కావడం దారుణమని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

కాంగ్రెస్‌ హైకమాండ్‌ను ఇబ్బంది పెట్టడం శశిథరూర్‌కు అలవాటుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆపరేషన్‌ సింధూర్‌పై ప్రపంచదేశాల పర్యటనకు కూడా వెళ్లారు శశిథరూర్‌ . హైకమాండ్‌ వ్యతిరేకించినప్పటికి ప్రతినిధి బృందంతో వివిధ దేశాల్లో పర్యటించారు. అయితే పుతిన్‌తో భేటీకి రాహుల్‌ను కూడా ఆహ్వానిస్తే బాగుండేదన్నారు శశథరూర్‌. దౌత్యసంబంధమైన అంశాల్లో అన్ని పార్టీలది ఒకే విధానం ఉండాలన్నారు. ఇదిలావుంటే, పుతిన్‌ విందుకు రాహుల్‌కు ఆహ్వానం లేకపోవడంపై రాష్ట్రపతిభవన్‌ స్పందించింది. దౌత్య విషయాల్లో అనుభవం ఉన్న వాళ్లకే విందుకు ఆహ్వానించామని, ఇందులో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..