
గణతంత్ర దినోత్సవ వేళ పంజాబ్‌లో ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఫతేగడ్ సాహిబ్‌లో రైల్వే ట్రాక్‌ను పేల్చివేయడంతో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. పేలుడు రైలు ఇంజన్ ధ్వంసమయ్యింది. పేలుడుతో 12 అడుగుల మేర రైల్వే లైన్ ధ్వంసమయ్యింది. పంజాబ్ పేలుడు ఘటన లో లోకో పైలట్ గాయాలయ్యాయి. ఆస్పత్రిలో లోక్‌పైలట్‌కు చికిత్స జరుగుతోంది. ప్రత్యేకంగా సరకు రవాణా రైలు కార్యకలాపాల కోసం నిర్మించిన ఈ కొత్త రైల్వే లైన్‌ను టార్గెట్ చేశారు ఉగ్రవాదులు .
ఇదే సమయంలో పంజాబ్‌లో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాదల సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. ఆరుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసి, వారి నుంచి 2.5 కిలోల ఆర్డీఎక్స్‌ను, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో దాడులకు వారు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఉగ్రవాదులను శరణ్ ప్రీత్ సింగ్, దిల్జోత్ సింగ్ సైని, హర్మాన్, అజయ్, అర్ష్‌దీప్ సింగ్‌లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉగ్ర ముఠాను అమెరికాకు చెందిన బబ్బర్ ఖల్సా హ్యాండ్లర్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారి ఆదేశాల మేరకు నిందితులు పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు రచించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు.
రిపబ్లిక్ డే నాడు దేశవ్యాప్తంగా ఐఎస్‌ఐ-జైషే- ఖలిస్తాన్ ఉగ్రవాదుల నెట్‌వర్క్ మారణహోమానికి కుట్ర చేసినట్టు నిఘా వర్గాలు ముందే హెచ్చరించాయి. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టదిట్టం చేశారు. పంజాబ్‌లో రైల్వే ట్రాక్ పేల్చివేత తరువాత దేశమంతా హైఅలర్ట్ కొనసాగుతోంది. ఢిల్లీలో సరిహద్దుద్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. సింగ్ బోర్డర్‌లో ప్రతి వాహనాన్ని చెక్ చేసిన తరువాత ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. కమెండోలను కూడా మోహరించారు.
అటు జమ్ము కాశ్మీర్‌లో కూడా హైఅలర్ట్ కొనసాగుతోంది. శ్రీనగర్‌లో రిపబ్లిక్ డే నాడు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రతి చోట భద్రతను పెంచారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..