Pune Kidney Racket: మహారాష్ట్రలో బయటపడిన కిడ్నీ రాకెట్ కేసు.. అసలు దొంగలు ఎవరో తెలిసి పోలీసుల షాక్..

|

May 13, 2022 | 3:36 PM

Kidney Racket Case: రూబీ హాల్ క్లినిక్‌లోని వైద్యుడు గ్రాండ్ పర్వేజ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. దృవీకరణ  పత్రాలను నిర్దారించుకోకుండానే కిడ్నీ మార్పిడి..

Pune Kidney Racket: మహారాష్ట్రలో బయటపడిన కిడ్నీ రాకెట్ కేసు.. అసలు దొంగలు ఎవరో తెలిసి పోలీసుల షాక్..
Pune Kidney Racket
Follow us on

మహారాష్ట్రాలో ఇప్పుడు కిడ్నీ రాకెట్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో రూబీ హాల్ క్లినిక్‌కి (Ruby Hall Clinic) చెందిన 15 మంది వైద్యులపై కేసు నమోదైంది. కిడ్నీ రాకెట్ కేసులో ఓ మహిళ కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో(Koregaon park police) ఫిర్యాదు చేయగా.. పోలీసులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు. రూబీ హాల్ క్లినిక్‌లోని వైద్యుడు గ్రాండ్ పర్వేజ్ సహా 15 మందిపై కేసు నమోదు చేశారు. దృవీకరణ  పత్రాలను నిర్దారించుకోకుండానే కిడ్నీ మార్పిడి చేశారని ఛార్జీషిట్‌లో పోలీసులు పేర్కొన్నారు. రూ.15 లక్షలు ఎర చూపి కొల్హాపూర్ మహిళ కిడ్నీ తొలగించారు. ఈ విషయమై ఆమె ఫిర్యాదు చేయడంతో వైద్యారోగ్య శాఖ కసరత్తు ప్రారంభించింది. ఏజెంట్లు తయారు చేసిన తప్పుడు పత్రాలను ధృవీకరణలోకి తీసుకుని డా. తవారే నేతృత్వంలోని  కమిటీ తప్పుపట్టింది.

బిబ్వేవాడికి చెందిన 32 ఏళ్ల బిల్డర్ ముంద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కిడ్నీ రాకెట్ బయటకొచ్చింది. దీని ప్రకారం పోలీసులు నయన్ గణేష్ పటోలే, అజయ్ థోరట్, నజీమ్ సయ్యద్, అతనికి సహకరించిన మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు.

ససూన్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు..

పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో కిడ్నీ మార్పిడి మోసం కేసులో సాసూన్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌పై విచారణ జరిగింది. సూపరింటెండెంట్ డా. అజయ్ తవారే సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. డివిజనల్ అవయవ మార్పిడి గుర్తింపు సంఘం అధ్యక్షుడిగా తావారే ఉన్నారు. మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూబీ హాల్ క్లినిక్, ససూన్ జనరల్ సూపరింటెండెంట్‌పై వైద్యశాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పుడు 15 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.

అవయవ మార్పిడి గుర్తింపు సంఘం చైర్మన్‌గా..

డా. తవారే ససూన్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ అప్రూవల్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నారు. కిడ్నీ అక్రమ రవాణా కేసులో రూబీ హాల్ క్లినిక్ ట్రాన్స్‌ప్లాంట్ లైసెన్స్‌ను ఆరోగ్య శాఖ రద్దు చేసింది. అనంతరం వైద్య విద్యాశాఖ విచారణ కమిటీని కూడా నియమించి చర్యలు చేపట్టింది. తావారే సస్పెన్షన్‌ తర్వాత తాత్కాలిక సూపరింటెండెంట్‌ పోస్టును డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా. విజయం జాదవ్‌కు అప్పగించారు. తావారే గతంలో  ఫోరెన్సిక్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.