అన్ని రంగాల్లో ఇక ‘ప్రైవేటు మంత్రం’ ! కొత్త పాలసీకి శ్రీకారం

| Edited By: Anil kumar poka

May 17, 2020 | 1:50 PM

అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఇక ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. నాన్-స్ట్రాటిజిక్ సెక్టార్లలో  (కీలకేతర రంగాల్లో) ప్రభుత్వ ఆధ్వర్యంలోని...

అన్ని రంగాల్లో ఇక ప్రైవేటు మంత్రం ! కొత్త పాలసీకి శ్రీకారం
Follow us on

అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఇక ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. నాన్-స్ట్రాటిజిక్ సెక్టార్లలో  (కీలకేతర రంగాల్లో) ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలను ప్రైవేటీకరిస్తామని ఆమె చెప్పారు. ఏవి కీలక రంగాలో డిఫైన్ చేసేందుకు ప్రభుత్వం కొత్తగా ‘పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ’ ని రూపొందిస్తుందని ఆమె వెల్లడించారు. వీటిలో నాలుగుకు మించి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబోన్నారు. పబ్లిక్ సెక్టార్ లో కనీసం ఒక సంస్థ ఉంటుందని, అదే సమయంలో ప్రైవేటు రంగాన్ని కూడా అనుమతిస్తామని నిర్మల పేర్కొన్నారు. కీలక రంగాల జాబితాను తరువాత ప్రకటిస్తాం అని అన్నారు. వృధా వ్యయాన్ని తగ్గించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు.