భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
Rahul Gandhi Revanth Reddy

Updated on: May 07, 2025 | 9:57 AM

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సిందూర్ పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. మేరా భారత్ మహాన్, జైహింద్ అంటూ అందరూ ట్వీట్ లు చేస్తున్నారు.

ఆపరేషన్ సిందూర్ పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..

కాగా.. ఆపరేషన్‌ సింధూర్‌పై లోకసభలోని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా అన్నారు రాహుల్. జై హింద్ అంటూ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్..

ఆపరేషన్‌ సింధూర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు గర్వపడేలా చేస్తున్నాయన్నారు. సాయుధ దళాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం.. జై హింద్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.

అత్యవసర సమీక్ష..

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులతో.. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణమే హైదరాబాద్ బయల్దేరి రావాలని సూచించారు. తాజా పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని.. అన్ని విభాగాల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా.. సాయంత్రం జరిగే మాక్ డ్రిల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..