Priyanka Gandhi: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ సలహాలు.. కాంగ్రెస్ కమిటీ తొలి భేటీలో అనూహ్య నిర్ణయాలు

కాంగ్రెస్‌ గేర్‌ మార్చింది. ఇక మీదట ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకెళ్లాలని డిసైడ్‌ అయింది. వార్‌రూమ్‌లో ఇవాళ వాడివేడిగా సాగిన మీటింగ్‌లో కీలకాంశాలపై చర్చ

Priyanka Gandhi: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీ సలహాలు.. కాంగ్రెస్ కమిటీ తొలి భేటీలో అనూహ్య నిర్ణయాలు
Priyanka Gandhi

Updated on: Sep 14, 2021 | 6:38 PM

Congress Party: కాంగ్రెస్‌ గేర్‌ మార్చింది. ఇక మీదట ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకెళ్లాలని డిసైడ్‌ అయింది. వార్‌రూమ్‌లో ఇవాళ వాడివేడిగా సాగిన మీటింగ్‌లో కీలకాంశాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్త సమస్యలపై పోరుబాట పట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్‌ పార్టీ.. దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో నియమించిన 9 మంది సభ్యుల కమిటీ నేడు తొలిసారి భేటీ అయింది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో 2 గంటల పాటు సాగింది ఈ సమావేశం. ఉద్యమాలపై ఓ ప్రణాళిక రూపొందించింది కమిటీ.

ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మనీశ్ ఛత్రాత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, జుబేర్ ఖాన్, డాక్టర్ రాగిణి నాయక్, ఉదిత్ రాజ్ హాజరయ్యారు. సెప్టెంబర్‌ 20 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలతో కలిసి పెట్రోల్, గ్యాస్‌ ధరల పెంపు సహా పలు అంశాలపై కలిసికట్టుగా ఆందోళనలు చేపడతామని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్. ఈనెల 27న రైతుల భారత్ బంద్‌కి సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

ప్రజా సమస్యలపై ప్రధానంగా సమావేశంలో చర్చించామన్నారు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఇంధన ధరలతో పాటు రైతులు, నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల మానిటైజేషన్‌ వంటి సమస్యలపై పోరాటం తీవ్రతరం చేయాలని నిర్ణయించామన్నారు ఎంపీ. బీజేపీ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. 2024లో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు, సెమినార్లు చేపడతామన్నారు ఉత్తమ్‌. మొత్తంగా పార్టీ సీనియర్లతో ఏర్పాటైన ఈ కమిటీ ప్రజా సమస్యలపై ప్రధానంగా దృష్టిసారించనుంది. సర్కారు వైఫల్యాలపై గళమెత్తేందుకు వ్యూహాలు రచించనుంది.

Read also: Harish Rao: హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి హరీశ్ రావు