Priyanka Gandhi: ప్రీ వెడ్డింగ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక గాంధీ.. నాటి ఘటనను తలచుకుని బాధను వ్యక్తం చేసిన..!

|

Feb 17, 2021 | 10:02 PM

Priyanka Gandhi: ప్రతి ఒక్కరి జీవితంలో మధుర స్మృతులు అనేవి తప్పకుండా ఉంటాయి. సామాన్యులు మొదలు.. ప్రముఖల వరకు..

Priyanka Gandhi: ప్రీ వెడ్డింగ్ ఫోటో షేర్ చేసిన ప్రియాంక గాంధీ.. నాటి ఘటనను తలచుకుని బాధను వ్యక్తం చేసిన..!
Follow us on

Priyanka Gandhi: ప్రతి ఒక్కరి జీవితంలో మధుర స్మృతులు అనేవి తప్పకుండా ఉంటాయి. సామాన్యులు మొదలు.. ప్రముఖల వరకు తమ తమ జీవితంలోని ముఖ్యమైన సంఘటలను పదిలంగా దాచుకుంటారు. అలాంటి ఒక చిత్రాన్నే కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఆనందంతో కాదు.. బాధతో ఆ పోస్ట్ చేశారు. 1997 ఫిబ్రవరి 18న ప్రియాంక గాంధీ ప్రముఖ పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకున్నారు. దానికి ముందు రోజు.. అంటే ఫిబ్రవరి 17న ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. ఆ సందర్భంగా ప్రియాంక తన మరదలు మిచెల్‌తో కలిసి ఆమె ఫోటోలు దిగారు. అయితే, నేటితో ప్రియాంక గాంధీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు 24 ఏళ్లు అవుతోంది.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తన మరదలితో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేశారు. ‘24 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు. నా ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. ఆ వేడుకలో నాతో నా ప్రియమైన మరదలు మిచెల్‌. తను ఇప్పుడు లేదు.’ అంటూ ప్రియాంక గాంధీ క్యాప్షన్ పెట్టారు. కాగా, ప్రియాంక గాంధీ మరదలు మిచెల్ 2001లో ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. నాటి ఘటనను గుర్తు చేస్తూ ప్రియాంక గాంధీ తన బాధను వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ చేసిన ఈ పోస్ట్ కాసేపట్లోనే తెగ వైరల్ అయ్యింది. చాలా మంది నెటిజన్లు మిచెక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మరికొందరైతే.. ప్రియాంక గాంధీ.. 1997లో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారంటూ కామెంట్లు పెట్టారు.

Priyanka Gandhi Insta Post:

Also read:

Sonu Sood: అమ్మ మాటలతో ముందుకెళ్లా.. సినిమాలతో పేరొచ్చింది.. కానీ ‘సాయం’ సంతృప్తినిచ్చింది: సోనూసూద్

How to record WhatsApp voice calls Video: మీకు వాట్సప్ కాల్ ఎలా రికార్డ్ చేయాలో తెలుసా ..?