Wayanad By Election Result 2024: వయనాడ్‌లో బీజేపీకి షాక్.. దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ

|

Nov 23, 2024 | 11:40 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. దీంతో ఇటీవలే జరిగిన వాయనాడ్ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ బరిలో దిగింది. నేడు వాయనాడ్ ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆమె రెండు లక్షల ఓట్ల అధిక్యంలో ప్రియాంక గాంధీ కౌంటింగ్లో దూసుకుపోతుంది.

Wayanad By Election Result 2024: వయనాడ్‌లో బీజేపీకి షాక్.. దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
Priyanka Gandhi Leads In Wayanad
Follow us on

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఈరోజు  ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తొలి ట్రెండ్స్‌లో ప్రియాంక గాంధీ ముందంజలో ఉన్నారు. బీజేపీ వెనుకబడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి ఈ సీటును గెలుచుకుని పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన సీపీఐ(ఎం) అభ్యర్థి అన్నీ రాజాపై 3 లక్షల 64 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.

రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుండి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే అతని సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో వాయనాడ్ లోక్‌సభ స్థానంలో 73.57 శాతం ఓటింగ్ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మొత్తం 6,47,445 ఓట్లు వచ్చాయి. కాగా ఆయన సమీప ప్రత్యర్థి అన్నీ రాజా కేవలం 2,83,023 ఓట్లకే పరిమితమయ్యారు. అదేవిధంగా మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కే సురేంద్రన్‌కు కేవలం 1,41,045 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడిఎఫ్) అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (CPM) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి సత్యన్ మొకేరి బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి నవ్య హరిదాస్ కూడా పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థులు పోటి చేశారు.

కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఉన్నతమైన స్థానం. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. 2024లో కూడా ఆయన ఈ స్థానం నుంచి గెలుస్తారు. కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న కేరళలోని వయనాడ్ సీటుకు రాజకీయ ప్రాధాన్యత మాత్రమే కాదు, దాని సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయం కూడా చాలా గొప్పది. వల్లీయూర్ కేవు భగవతి ఆలయం ఇతర ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా షెడ్యూల్డ్ తెగల జనాభా ఉంది. నల్ల మిరియాలు, కాఫీ ఇక్కడ అధికంగా పండిస్తారు. నిజానికి దీని వల్లే వాయనాడ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఈ స్థానంలో పోటీ చేసి మొత్తం 7,06,367 ఓట్లను సాధించారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాహుల్ గాంధీకి మొత్తం 64.94 శాతం ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో రెండో స్థానంలో ఉన్న సీపీఐ (మార్క్సిస్టు)కి చెందిన పీపీ సునీర్‌కు కేవలం 2,74,597 ఓట్లు మాత్రమే వచ్చాయి. దివంగత కాంగ్రెస్ నేత ఎంఐ షానవాస్ 2009, 2014లో ఈ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2018లో దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి