PM Modi: ఢిల్లీ కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసిన నరేంద్ర మోదీ..

|

Sep 08, 2022 | 7:51 PM

Central Vista Avenue: దేశ రాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టా లాన్స్, కర్తవ్యపథ్‌ను ప్రధాని మోదీ గురువారం రాత్రి 7 గంటలకు ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించారు.

PM Modi: ఢిల్లీ కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని.. నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిసిన నరేంద్ర మోదీ..
Central Vista Avenue
Follow us on

ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు. ఇండియా గేట్‌ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా.. కర్తవ్యపథ్‌ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులను కలిశారు ప్రధాని మోదీ. అద్భుతంగా కర్తవ్యపథ్‌ను తీర్చిదిద్దారని వారిని ప్రశంసించారు. తరువాత కర్తవ్యపథ్‌పై ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఢిల్లీలో రాజ్‌పథ్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కర్తవ్యపథ్‌ను రూపొందించారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న కర్తవ్యపథ్ ఏరియాను, సెంట్రల్ విస్టా లాన్స్‌ను రీడెవలప్ చేసి, ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు సెంట్రల్ విస్టాను శోభాయమానంగా తీర్చిదిద్దారు.

అయితే ఇండియా గేట్ నుంచి మ‌న్ సింగ్ రోడ్డు వ‌ర‌కు ఉన్న లాన్స్‌లో పిక్నిక్స్‌, ఫుడ్స్‌ను అనుమ‌తించ‌డం లేదు. లాన్స్ వ‌ద్ద ఉన్న చిన్న చిన్న కెనాల్స్‌పై 16 ప‌ర్మినెంట్ బ్రిడ్జ్‌ల‌ను క‌ట్టారు. రద్దీగా ఉండే జంక్షన్లలో పాదచారుల కోసం నాలుగు అండర్‌ పాస్‌లను నిర్మించారు.

సందర్శకుల రక్షణ కోసం 900కంటే ఎక్కువ లైట్‌ పోల్స్‌ను ఏర్పాటుచేశారు. బైకులు, కార్లు, క్యాబ్స్‌, బస్సులు, ఆటోల పార్కింగ్‌ కోసం వేర్వేరుగా పార్కింగ్‌ బేలు ఏర్పాటుచేశారు. ఇక రిపబ్లిక్‌ డే పరేడ్‌ కోసం స్పెషల్‌ అరేంజ్‌మెంట్స్‌  చేశారు.

నేతాజీ జయంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 23న ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ స్టాచ్యూను ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ప్లేస్‌లో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం దేశ స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ అందించిన స్పూర్తి గుర్తుగా ఉంటుందన్నారు. తమిళనాడుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ 28 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏకశిలా గ్రానైట్ పై చెక్కారు. విగ్రహం మొత్తం బరువు 65 టన్నులని కేంద్రం ప్రకటించింది.

ఢిల్లీలోని రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను NDMC ఆమోదించింది. ఇండియా గేట్ దగ్గర నుంచి నేతాజీ విగ్రహం దగ్గర నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న రాజ్ పథ్ ఏరియాను ఇకపై కర్తవ్యపథ్‌గా పిలవనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..