PM Modi on Budget 2022: బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలుః మోడీ

|

Feb 01, 2022 | 3:37 PM

ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 100 ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు.

PM Modi on Budget 2022: బడ్జెట్ ఆర్థిక వ్యవస్థ బలోపేతంతో పాటు సామాన్యులకు కొత్త అవకాశాలుః మోడీ
Modi
Follow us on

PM Modi on Budget 2022: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఈ బడ్జెట్‌లో పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని అన్నారు. 100 ఏళ్ల తీవ్ర విపత్తు మధ్య ఈ బడ్జెట్ అభివృద్ధిపై కొత్త విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సామాన్యులకు అనేక కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. మరిన్ని మౌలిక సదుపాయాలు, మరిన్ని పెట్టుబడులు, మరింత అభివృద్ధి, మరిన్ని ఉద్యోగాల కొత్త అవకాశాలతో ఈ బడ్జెట్ నిండుగా ఉందన్నారు. ఇది గ్రీన్ ఉద్యోగాల రంగం కూడా తెరవడం జరుగుతుందన్నారు. దేశంలోనే తొలిసారిగా హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు పర్వతమాల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రణాళిక పర్వతాలపై ఆధునిక రవాణా వ్యవస్థను సృష్టిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ బ‌డ్జెట్ మ‌రిన్ని మౌలిక స‌దుపాయాలు, ఎక్కువ పెట్టుబ‌డులు, మ‌రింత వృద్ధి, మ‌రిన్ని ఉద్యోగాల కొత్త అవ‌కాశాల‌తో నిండి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇది గ్రీన్ జాబ్స్‌కు కూడా తెరతీస్తుంది. గత కొన్ని గంటలుగా చూస్తున్నాను, ఈ బడ్జెట్‌కు ప్రతి రంగంలోనూ ఆదరణ లభిస్తున్న తీరు, సామాన్యుల నుంచి వస్తున్న సానుకూల స్పందన ప్రజలకు సేవ చేయాలనే ఉత్సాహాన్ని పెంచిందని ప్రధాని తెలిపారు.


భారత ప్రజల విశ్వాసం, గంగామాత ప్రక్షాళనతో పాటు రైతుల సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన చర్య తీసుకోవడం జరిగందన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల్లో గంగా తీరం వెంబడి సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. రేపు ఉదయం 11 గంటలకు బడ్జెట్, స్వావలంబన భారతదేశం అనే అంశంపై మాట్లాడేందుకు భారతీయ జనతా పార్టీ నన్ను ఆహ్వానించింది. రేపు 11 గంటలకు బడ్జెట్‌పై ఈ అంశంపై వివరంగా మాట్లాడతానని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.