దేశంలోని మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ సమావేశంలో పాల్గొననున్నారు. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (DAY-NRLM) కింద లబ్ధిదారులుగా ఉన్న మహిళలతో మాట్లాడనున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం… దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్‌హెచ్‌జి (స్వయం సహాయక బృందం) సభ్యుల విజయ కథల సేకరణతో పాటు వ్యవసాయ జీవనోపాధిని విశ్వవ్యాప్తం చేయడంపై ఒక హ్యాండ్‌బుక్‌ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పుస్తకాన్ని ప్రధాని విడుదల చేయనున్నారు. నాలుగు లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సాయంగా ప్రధాని రూ.1,625 కోట్లు మంజూరు చేయనున్నారు. దీనితో పాటు పీఎంఎఫ్ఎంఈ (పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజస్) పథకం కింద 7,500 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.25 కోట్లను విడుదల చేయనున్నారు. 75 ఎఫ్పీఓలకు కూడా రూ.4.13 కోట్లను నిధులను ప్రకటించనున్నారు.
గ్రామీణ పేదలను దశల వారీగా స్వయం సహాయక సంఘాల్లో భాగం చేయడమే దీన్‌దయాల్ అంత్యోదయ యోజన లక్ష్యం అని ప్రధాని కార్యాలయం పేర్కొంది. గ్రామీణ పేదల ఆదాయాలు, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి… వారికి దీర్ఘకాలిక మద్దతును అందించడానికి ఈ మిషన్ ఉపమోగపడుతుంది గతంలో పలుమార్లు ప్రధాని మోదీ చెప్పారు. గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్.. ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల మంత్రి పశుపతి కుమార్ పరాస్‌తో పాటు పలువురు సహాయ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ వర్చవల్ సమావేశంలో పాల్గొననున్నారు.
భారత్‌కు ఎఫ్‌డీఐల వెల్లువ: ప్రధాని
భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగా వస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) 2021 వార్షిక సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని.. ఈ వివరాలు వెల్లడించారు. కంపెనీ స్వదేశానిది కాకపోయినా.. వాటి ఉత్పత్తులు మాత్రం ఇండియాలోనే తయారు కావాలనేదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు మోదీ. దేశంలో ప్రస్తుతం 60 యూనికార్న్ అంకురాలు ఉన్నాయని.. అందులో 21 కంపెనీలు గడిచిన కొన్ని నెలల్లోనే ఆ మార్క్‌ను అందుకున్నాయని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్ సహా.. ఇతర సభ్యులు, పలువురు పారిశ్రామికవేతలు పాల్గొన్నారు.
Also Read: సీఎం జగన్ సంచలనం.. భవిష్యత్‌లో కుటుంబానికి కాకుండా ప్రతి వ్యక్తికి ‘ఆరోగ్య శ్రీ’ కార్డు