Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..

NDA Presidential Candidate: రాష్ట్రపతి రేసులో అభ్యర్థిని నిలిపేందుకు బీజేపీ పెద్ద కసరత్తే చేసింది. కాసేపటి క్రితం వరకూ బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని నడ్డా ప్రకటించారు.

Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము.. తొలిసారి గిరిజన మహిళ..
Draupadi Murmu

Updated on: Jun 21, 2022 | 9:53 PM

భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్రపతి ఎన్నికలకు అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ తన అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) బరిలోకి దింపింది. ఇక ఫలితమే తేలాలి. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను నిలిపితే NDA తన అభ్యర్థిగా ముర్మును తెరపైకి తెచ్చారు. ఉదయం నుంచి చత్తీస్‌ఘడ్‌ గవర్నర్‌గా ఉన్న అనసూయ ఉయికే పేరు వినిపించింది. కానీ పార్లమెంటరీ కమిటీ భేటీ తర్వాత ద్రౌపతి ముర్మును ప్రకటించింది బీజేపీ. అంతకుముందు, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించిన తర్వాత, తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పుడు జూలై 18న ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ పత్రాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సంఖ్యాబలం ప్రాతిపదికన పటిష్ట స్థితిలో ఉందని, దానికి బీజేడీ లేదా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీల మద్దతు లభిస్తే విజయం ఖాయం అని గమనించాలి.

జాతీయ వార్తల కోసం