బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం.. ముందే తెలిసి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారుః బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా

|

Mar 02, 2021 | 8:10 PM

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుగా తన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను నియమించడంపై పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ఖాయం.. ముందే తెలిసి ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారుః బీజేపీ ప్రతినిధి సంబిత్ పత్రా
Follow us on

Prashant Kishor has left Mamata : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన సలహాదారుగా తన రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్‌ను నియమించడంపై పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందే కిషోర్ ‘మమతా బెనర్జీని విడిచిపెట్టారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా ఎద్దేవా చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఓటమి ఖాయం కావడంతో ప్రశాంత్ కిశోర్ తప్పుకున్నారని ఆయన అన్నారు. బెంగాల్‌లో బీజేపీ 200 సీట్లు గెలుచుకుంటుందనే వాస్తవం.. అందుకే కిషోర్ నిష్క్రమించారని పత్రా దుయ్యబట్టారు.


ఇదిలావుంటే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండంకెల స్థానాలకు మించి రావని సవాల్ చేసిన సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరో కొత్త బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశాంత్ కిషోర్‌ను తన ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. 2022 లో పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ప్రశాంత్ కిషోర్ బృందం ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ ఇప్పటికే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించింది. దీంతో ఘనం విజయం సాధించి అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎనిమిది దశల్లో ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27నుంచి జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.

ఇదీ చదవండిః  మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు చురుకుగా ఏర్పాట్లు.. హైకోర్టు ఆదేశాలతో వేగం పెంచిన ఎస్ఈసీ