బ్రేకింగ్‌.. కల్నల్‌ సంతోష్ పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ సంచలన విషయాలు

సోమవారం రాత్రి లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో కల్నల్‌ సంతోష్ బాబు కూడా ఉన్నారు.

బ్రేకింగ్‌.. కల్నల్‌ సంతోష్ పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ సంచలన విషయాలు

Edited By:

Updated on: Jun 19, 2020 | 9:59 PM

సోమవారం రాత్రి లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో భారత్‌-చైనా జవాన్ల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరవై మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో కల్నల్‌ సంతోష్ బాబు కూడా ఉన్నారు. అయితే ఈ దాడి చైనా పక్కా ప్లాన్‌ వేసి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముందస్తు ప్లాన్ ప్రకారం.. ఇనుప చువ్వలు ఉన్న రాడ్లను వెంట తెచ్చుకున్నారు చైనా సైనికులు. అంతేకాదు.. కల్నల్‌ సంతోష్ బాబును టార్గెట్ చేస్తూ దాడి చేశారని.. అతడి తలపై బలమైన గాయాలతో పాటు.. శరీరంపై ఇనుప చువ్వలు కల్గిన రాడ్లతో దాడి చేసిన ఆనవాళ్లు ఉన్నట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది.  ఈ రిపోర్టుల ఆధారంగా చైనా పక్కా ప్లాన్‌ వేసి.. గాల్వన్‌లో ఘర్షణకు దిగినట్లు అర్ధమవుతోంది.మరోవైపు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా చైనా పక్కా ప్లాన్ వేసి దాడి చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, గురువారం నాడు కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు మన తెలంగాణ రాష్ట్రలోని సూర్యపేట్ లో సైనిక లాంచనాలతో జరిగాయి. ఈ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. సంతోష్ బాబు అమర్ రహే, భారత్ మాతా కీ జై అన్న నినాదాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు ఇచ్చారు.