
Police Dangles Elderly Man: రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ వృద్ధుడిపై ఓ పోలీస్ దాడిచేశాడు. కనీసం వృద్ధుడన్న కనికరం లేకుండా విచక్షణా రహితంగా దాడిచేశాడు. పదే పదే అతని మొహంపై తన్నుతూ వీరంగా సృష్టించాడు. అంతటితో ఆగకుండా కాళ్లు పట్టి ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాక్ పై అమాంతం వేలాడదీశాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. గురువారం యూనిఫాం ధరించిన ఓ పోలీసు.. వృద్ధుడిని తన్నుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
వీడియోలో పోలీసు ఆ వ్యక్తిని అతని ముఖంపై తన్నడం చూడవచ్చు. ఆ వ్యక్తి లేచిన వెంటనే కోపంతో వేలు చూపించిన పోలీసు.. మరొకసారి కొడతాడు. అలా తన్నుకుంటూ.. వృద్ధుడి కాళ్లను పట్టుకుని ప్లాట్‌ఫారమ్ అంచుకు వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా విచక్షణారహితంగా దాడిచేశాడు. అయితే.. పోలీస్ తతంగాన్ని అంతా చూస్తూ నిలబడ్డారు కానీ.. ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు.
వీడియో చూడండి..
@ChouhanShivraj @AshwiniVaishnaw @drnarottammisra @AmitShah
Video of mp jabalpur railway station
Is kya bartab ha police ek old age person ke liye
This police personal must be suspended and take strict action against them pic.twitter.com/8kR9RG9DMm— Sombrat arjariya (@ArjariyaSombrat) July 29, 2022
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఆ పోలీసును అనంత్ శర్మగా గుర్తించిన అధికారులు అతన్ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బాధితుడిని గోపాల్ ప్రసాద్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. తనను ఓ వ్యక్తి తిడుతున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని.. ఈ సమయంలో పోలీస్ ఎందుకు కొట్టాడో అర్ధం కాలేదంటూ బాధితుడు పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి