
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని బండ్లగూడ, నార్సింగీ, శంషాబాద్ లలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే విషయం తెలుసుకున్న ఎస్‌ఓటీ బృందం దర్యాప్తు చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా మూడు ఇళ్లల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2 కోట్ల నగదు, ల్యాప్‌టాప్, 36 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
ఈ ముఠా సభ్యులు ఆన్ లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారని.. ఈ ముఠాలకు సంబంధించి ఏడు మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆధ్వర్యంలో బెట్టింగ్ జరుగుతోందని వెల్లడించారు. బెంగళూరు నుంచి మానిటర్ చేస్తున్న ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రెండు నెలల వ్యవధిలోనే రూ.15 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అదుపులో ఉన్న నిందితులపై కేసులు నమోదు చేసినట్ల తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం