పీఓకె ఇక మనదేనా ? అక్కడి నుంచి ఐఎండీ వాతావరణ సూచనలు షురూ !

| Edited By: Pardhasaradhi Peri

May 07, 2020 | 7:46 PM

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ పట్టు బిగించడం ప్రారంభించింది. అక్కడి గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ లో ఈ నెల 5 నుంచి జమ్మూ కాశ్మీర్ లోని వాతావరణ విభాగం సూచనలు చేయడం మొదలు పెట్టింది. ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ కులదీప్ శ్రీవాత్సవ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. జమ్మూ కాశ్మీర్ వెదర్ సబ్ డివిజన్ లో భాగంగా ఈ ప్రాంతాలను పరిగణించనున్నామన్నారు. తన ఈ డివిజన్ లో ఈ విభాగం ‘జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, […]

పీఓకె ఇక మనదేనా ? అక్కడి నుంచి ఐఎండీ వాతావరణ సూచనలు షురూ !
Follow us on

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ పట్టు బిగించడం ప్రారంభించింది. అక్కడి గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ లో ఈ నెల 5 నుంచి జమ్మూ కాశ్మీర్ లోని వాతావరణ విభాగం సూచనలు చేయడం మొదలు పెట్టింది. ప్రాంతీయ వాతావరణ విభాగం హెడ్ కులదీప్ శ్రీవాత్సవ ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. జమ్మూ కాశ్మీర్ వెదర్ సబ్ డివిజన్ లో భాగంగా ఈ ప్రాంతాలను పరిగణించనున్నామన్నారు. తన ఈ డివిజన్ లో ఈ విభాగం ‘జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ అని మొత్తం ఈ ప్రాంతాలను కలిపి పేర్కొంటోంది. కాగా ఈ ప్రాంతాలు పాక్ భూభాగాలని, ఇక్కడ ఎన్నికలు నిర్వహించి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ పాక్ సుప్రీంకోర్టు గత నెల 30 న ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను తోసిపుచ్చిన భారత ప్రభుత్వం.. అవి తమభూభాగాలే అని స్పష్టం చేసిన సంగతి విదితమే.