Poisonous liquor: రాజస్థాన్‌లోని భిల్వాడా జిల్లాలో విషాదం నెలకొంది. కల్తీ మద్యం కాటుకు ఓ మహిళతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిలో ఇద్దరు మహిళలున్నారు. భిల్వారా జిల్లాలోని మండల్‌గఢ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శరణ్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు కల్తీ మద్యం తాగారు. దీంతో వారి పరిస్థితి విషమంగా మారింది. గమనించిన కుటుంబసభ్యులు వారిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మహిళతో సహా నలుగురు మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
గత కొన్నేళ్లల్లో జరిగిన కల్తీ మద్యం సంఘటనలతో పోలీస్తే భిల్వారాలో ఇది మూడవ పెద్ద సంఘటన అని పోలీసులు వెల్లడించారు. హుటాహుటిన గ్రామానికి చేరుకున్న పోలీసులు శాంపిళ్లను సేకరించి.. కేసు నమోదు చేశారు. భరత్ పూర్ తర్వాత రాష్ట్రంలో మరో ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం అధికారులను అదేశించింది.
Also Read: