Crime News: మనిషి కాదు మానవ మృగం.. కూతురు వయస్సున్న ముగ్గురు బాలికలపై..

రోజురోజుకూ మనుషులు మృగాళ్లా మారిపోతున్నారు. మానవులమన్న విషయం మరిచి కళ్లకు కనిపించిన మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. తన కూతురి వయస్సున్న ముగ్గురి చిన్నారులపై ఓ కామాందుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువుకావడంతో నిందితుడికి కోర్టు మరణశిక్ష విధించింది.

Crime News: మనిషి కాదు మానవ మృగం.. కూతురు వయస్సున్న ముగ్గురు బాలికలపై..
Tamil Nadu Pocso Verdict

Updated on: Mar 13, 2026 | 12:40 PM

తన కూతురి వయస్సున్న ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన 40 ఏళ్ల ఓ వ్యక్తికి కోర్టు మరణశిక్ష విధించిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లా అళగిరిపురం గ్రామానికి చెందిన ఆనంద్‌శేఖర్‌ అనే వ్యక్తి స్థానికం కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత మూడేళ్ల క్రితం ఇతను అదే గ్రామంలో ఉండే 6, 7, 8 సంవత్సరాల వయసున్న ముగ్గురు బాలికలపై ఒకరికి తెలియకుండా ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికలు అనారోగ్యానికి గురికావడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లగా వారపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.

విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు పాళయంకోట్టై ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికలను విచారించి జరిగిన విషయం తెలుసుకున్నారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం నిందితుడిని జిల్లా పోక్సో కోర్టులో హాజరుపర్చారు. మూడేళ్ల విచారణ తర్వాత తాజాగా నిందితుడిపై ఉన్న ఆరోపణలు రుజువు రావడంతో కోర్టు అతనికి మార్చి 12న మరణశిక్షను విధిస్తూ తీర్పు వెలువరిచింది. అలాగే ముగ్గురు బాధితులకు ఒక్కొక్కరికి రూ. 7 లక్షలు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us