నేడే పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్.. సీఎంలకు మాట్లాడే ఛాన్స్ !

| Edited By: Anil kumar poka

May 11, 2020 | 11:41 AM

ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగే అవకాశముంది...

నేడే పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్.. సీఎంలకు మాట్లాడే ఛాన్స్ !
Follow us on

ప్రధాని మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా సాగే అవకాశముంది. ఈ నెల 17 తో లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఏం చేద్దామన్నదే ఈ కాన్ఫరెన్స్ ప్రధాన అజెండా అని తెలుస్తోంది. మంగళవారం నుంచి పరిమితంగా ప్యాసింజర్ రైలు సర్వీసులను అనుమతించాలని ప్రభుత్వం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మొత్తం 30 జర్నీలతో కూడిన స్పెషల్ రైళ్లు ఢిల్లీ-14 రాష్ట్రాల మధ్య నడవనున్నాయి.ఈ నాటి వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులు స్వేచ్చగా తమ అభిప్రాయాలను వివరించవచ్చు. గతంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులలో వీరికి మాట్లాడే ఛాన్స్ లభించలేదు. కానీ వాటికి విరుధ్ధంగా నేటి కాన్ఫరెన్స్ లో వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను వివరించే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యేకంగా ఓ స్లాట్ ను సర్కార్ నిర్దేశించింది. లక్షలాది వలస కార్మికుల తరలింపులో ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడిన సంగతి తెలిసిందే. నోడల్ ఆఫీసర్లను నియమించినప్పటికీ ఈ రాష్ట్రాల మధ్య కో- ఆర్డినేషన్ లేకపోవడం కేంద్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

వలస కార్మికులకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక ఎకనామిక్ ప్యాకేజీ కోసం ముఖ్యమంత్రులు పట్టుబట్టే సూచనలున్నాయి. అలాగే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ రీకవరీ రేటు కూడా పెరగడం ఈ చర్చల్లో ప్రస్తావనకు రావచ్చు. ఈ రేటు సోమవారం నాటికి 31.14 శాతానికి చేరుకోవడం కొంత ఊరట కలిగించే విషయం. ఇది నిన్నటికి 26.59 శాతం ఉంది.