Narendra Modi: అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో మోదీ 23 ఏళ్ల ప్రస్థానం

|

Oct 07, 2024 | 9:50 PM

రాష్ట్రానికి, దేశానికి అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోదీ.. ఇవాళ్టితో 23 ఏళ్ల మైలురాయిని టచ్ చేశారు. పదమూడేళ్లలో సొంతగడ్డ గుజరాత్‌ని దేదీప్యమానంగా వెలిగించిన మోదీ.. తర్వాత పదేళ్లలో సొంత దేశాన్ని అదే పంథాలో ముందుకు తీసుకెళ్తున్నారు. దటీజ్ మోదీ అనిపించేంత స్థాయిలో.. పాలనా పరంగా తనదైన ముద్రతో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోదీ ప్రయాణాన్ని రీకాల్ చేసుకుంటోంది దేశం.

Narendra Modi: అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో మోదీ 23 ఏళ్ల ప్రస్థానం
PM Modi
Follow us on

2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎం..
2014 నుంచి 2024 వరకు ఇండియన్ పీఎం…
23 ఏళ్ల.. గ్రేట్ అండ్ మెమరబుల్ జర్నీ..
రాష్ట్రానికి, దేశానికి.. తిరుగులేని టార్చ్‌ బేరర్‌…

అక్కడ మొదలైన మోదీ జైత్రయాత్ర.. ఇవాళ్టిదాకా కొనసాగుతోంది. సరిగ్గా 23 ఏళ్లు గడిచాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అత్యున్నత రాజ్యాంగ పదవుల్ని నిర్వహించిన మోదీ ప్రయాణంలో ప్రతీ మలుపూ కీలకమే.

భూకంపంతో వణికిపోయిన క్లిష్ట సమయంలో 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు మోదీ. పదమూడేళ్ల తన పదవీకాలం తర్వాత ప్రధానిగా ప్రమోషన్ తీసుకునే సమయానికి… అదే గుజరాత్‌ని దేశంలోకెల్లా ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దారని మోదీపై కాంప్లిమెంట్లొచ్చాయి. గుజరాత్‌కి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా మోదీ పేరు మీదే ఉంది. సీఎంగా పదేళ్లలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు.. గుజరాత్ మోడల్‌ అనే పేరుతో మిగతా రాష్ట్రాలకూ దిక్సూచిలా మారాయి.

తర్వాత ప్రధానిగా న్యూ ఇండియా బ్యానర్‌ కింద.. మోదీ తీసుకున్న పాలనానిర్ణయాలు.. అమలుచేసిన సంక్షేమ పథకాలు.. ఆయన ఖ్యాతిని మరింత పెంచేశాయి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, సర్వశక్తి అభియాన్, ఉజ్వల గ్యాస్ సిలిండర్లు, సూర్య ఘర్ పేరుతో సబ్సిడీపై సోలార్ ప్యానెల్స్.. ఇవన్నీ గ్రామీణ వాతావరణాన్నే పూర్తిగా మార్చేశాయి.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ గుజరాత్‌ కార్యక్రమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి, ప్రధానిగా అదే మోడల్‌తో స్వచ్ఛ భారత్‌ని అమలుచేశారు. అప్పుడు సబర్మతి క్లీనింగ్, ఇప్పుడు నమామి గంగ, అప్పుడు కన్యా కేలవణి యోజన, ఇప్పుడు బేటీ బచావో బేటీ పడావో.. అప్పుడు వైబ్రంట్ గుజరాత్, ఇప్పుడు మేకిన్ ఇండియా.. అప్పుడు గుజరాత్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్, ఇప్పుడు స్కిల్ ఇండియా మిషన్.. ఇలా అభివృద్ధి, సామాజిక చైతన్య కార్యక్రమాలన్నిట్లోనూ తనదైన ముద్ర వేశారు.. వేస్తున్నారు. మన్‌కీ బాత్ పేరుతో ప్రతినెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియో ద్వారా జనంతో మమేకమౌతూ.. నా మనసంతా మీరే అని చాటిచెబుతున్నారు ప్రధాని మోదీ. ఇలా చేపట్టిన ప్రతీ కార్యక్రమమూ మోదీకి మానస పుత్రికలే.

ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ కొడతారా.. ఇక్కడితోనే ఆగిపోతారా అనే సస్పెన్స్‌కి తెరదించుతూ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో థింపింగ్ విక్టరీ కొట్టి థర్డ్‌టైమ్ పీఎం అయ్యారు. జవహర్‌లాల్ తర్వాత మూడోసారి ప్రధానిగా ఎన్నికైన ఏకైక ప్రధాని నరేంద్ర మోది.

ఒక మనిషి జీవితం మొత్తాన్ని జాతి కోసం అంకితం చేస్తే ఎలా ఉంటుందో.. మోదీ తన 23 ఏళ్ల జర్నీలో చూపించారు.. ఇన్నేళ్లూ ఆయన వెంటే ఉన్నందుకు నేను అదృష్టవంతుడ్ని అంటూ ఎమోషనల్ అయ్యారు హోమ్ మంత్రి అమిత్‌షా. బీజేపీయే కాదు.. యావద్దేశమూ మోదీ 23 ఏళ్ల ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..