PM Narendra Modi: సోమనాథ్‌ ఆలయ సమీపంలో భారీ సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ..

Somnath Temple Gujarat: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ప్రసిద్ధ

PM Narendra Modi: సోమనాథ్‌ ఆలయ సమీపంలో భారీ సర్య్కూట్ హౌస్.. నేడు ప్రారంభిచనున్న ప్రధాని మోదీ..
Pm Modi

Updated on: Jan 21, 2022 | 7:38 AM

Somnath Temple Gujarat: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ ఆలయానికి సమీపంలో రూ.30 కోట్లతో నిర్మించిన సర్క్యూట్ హౌస్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే.. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్క్యూట్ హౌస్‌ను ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

కాగా.. సోమనాథ్ ఆలయాన్ని ప్రతిఏటా దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనం ఆలయానికి దూరంగా ఉండడంతో కొత్త సర్క్యూట్ హౌస్ అవసరం ఏర్పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం.. కొత్త సర్క్యూట్ హౌస్‌ను రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించింది. దీనిని సోమనాథ్ ఆలయానికి సమీపంలోనే సకల సౌకర్యాలతో నిర్మించింది.

ఈ సర్క్యూట్ హౌస్‌లో లగ్జరీ, వీఐపీ, డీలక్స్ గదులు, కాన్ఫరెన్స్ రూమ్, ఆడిటోరియం హాల్ మొదలైన వాటితో సహా టాప్-క్లాస్ సౌకర్యాలన్నింటిని ఏర్పాటు చేశఆరు. ప్రతి గది నుంచి సముద్ర దృశ్యాలు కనిపించే విధంగా ల్యాండ్‌స్కేపింగ్ కూడా జోడించారు. వీఐపీలు, విదేశీ పర్యాటకులు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సర్క్యూట్ హౌస్‌ను నిర్మించారు.

Also Read:

UP Elections 2022: యూపీలో కొత్త నాయకత్వం.. బీఎస్పీలో చేరిన ప్రముఖ న్యాయవాది..

TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..