ఆక్సిజన్ కొరత నివారణకు టాటా గ్రూప్ చూపిన చొరవకు ధన్యవాదాలు, ప్రధాని మోదీ

| Edited By: Anil kumar poka

Apr 21, 2021 | 10:00 AM

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పేరు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఆక్సిజన్ లేదంటూ చేతులెత్తేశాయి...

ఆక్సిజన్ కొరత నివారణకు టాటా గ్రూప్ చూపిన చొరవకు ధన్యవాదాలు, ప్రధాని మోదీ
Pm Narendra Modi
Follow us on

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడింది. పేరు పొందిన కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఆక్సిజన్ లేదంటూ చేతులెత్తేశాయి.  ఈ పరిస్థితిపై నిన్న ప్రధాని మోదీ  జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో  తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో రోగులకు ప్రాణాధారమైన ఆక్సిజన్ తగినంతగా లభ్యమేయ్యేలా చూసేందుకు పరిశ్రమలు తమ ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకోవాలని సూచించారు.  అన్ని కోవిడ్ ఆసుపత్రులు దీని లభ్యతకు తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ సందర్భంలో ప్రధాని పిలుపు  మేరకు ప్రధానంగా టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. లిక్విడ్ ఆక్సిజన్ ని ట్రాన్స్ పోర్ట్ చేసేందుకు 24 క్రయోజెనిక్ కంటెయినర్లను దిగుమతి చేసుకుంటామంటూ ట్విటర్ ముఖంగా ఆ సంస్థ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. ఇది టాటా గ్రూప్ సౌహార్ద్ర చర్య అని ఆయన అభివర్ణించారు. భారత ప్రజలకు మోదీ ఇచ్చిన సూచనలు ప్రశంసించదగినవని, కోవిడ్ 19 పై  పోరులో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తాము కూడా సహకరిస్తామని, ఆక్సిజన్ కొరత నివారణకు వెంటనే చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ ప్రకటించింది. దేశంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో తమవంతు కృషి చేస్తామని పేర్కొంది.

ఈ ట్వీట్ పై స్పందించిన ప్రధాని మోదీ.. తన వివిధ ధార్మిక కార్యక్రమాల ద్వారా టాటా గ్రూప్ ట్రస్ట్ ప్రజలకు సేవలందిస్తున్నదని, ఇందుకు కృతజ్ఞతలని తాను కూడా ట్వీట్ చేశారు. ఈ మల్టీ నేషనల్ కంపెనీని అభినందించారు. ఈ సంస్థ గత ఏడాది కూడా కరోనా నివారణకు రూ. 1500 కోట్లను కేటాయించింది. పైగా వెంటిలేటర్లు, పీపీఈ  కిట్లు తదితరాలను దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా చేసింది. ఆరు వారాల్లో కేరళలో ప్రత్యేకంగా ఆసుపత్రిని నిర్మించింది. నాటి ఈ ధార్మిక చర్యలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : జీవిత పరమార్ధం తెలిసిందంటూ సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటీమణులు వీడియో : Bollywood Heroine Video.
యువతే టార్గెగా కిలాడీ లేడీ మెల్లగా మత్తులోకి దించి.. వ్యాపారం చేస్తున్న మహిళ : lady arrest in vizianagaram video.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్..ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ గిఫ్ట్ : NTR New Movie Update Video