PM Narendra Modi: భారత్‌ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్నే కోరుకుంటుంది.. పాక్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు

|

Apr 12, 2022 | 7:08 AM

PM Modi Congratulates Pakistan PM: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్‌ (Shehbaz Sharif) ఎన్నికైన విషయం తెలిసిందే. 70 ఏళ్ల పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ పాకిస్తాన్ 23వ

PM Narendra Modi: భారత్‌ ఎల్లప్పుడూ శాంతి, స్థిరత్వాన్నే కోరుకుంటుంది.. పాక్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు
Pm Modi
Follow us on

PM Modi Congratulates Pakistan PM: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్‌ (Shehbaz Sharif) ఎన్నికైన విషయం తెలిసిందే. 70 ఏళ్ల పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్‌ పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా సోమవారం ప్రమాణం చేశారు. ఈ పాక్ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన మియాన్‌ ముహమ్మద్‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు అభినందనలు. భారత్‌ ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది. ఉగ్రవాదం లేని ప్రాంతంలో మనం అభివృద్ధి లాంటి సవాళ్లపై దృష్టి సారించవచ్చాన్నారు. ఇది మన ప్రజలందరికీ ఎంతో శ్రేయస్కరం అంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు.

కాగా.. పాకిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో.. ఎన్నో మలుపుల మధ్య ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షాబాజ్‌కు పాకిస్తాన్‌ నేషనల్ అసెంబ్లీ (Pakistan National Assembly) నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ప్రధాని ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. ఆయనకు అనుకూలంగా 174 ఓట్లు పోలయ్యాయి. ఈ విషయాన్ని స్పీకర్ అయాజ్ సాదిక్ ప్రకటించారు.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ఎంపీలు పార్లమెంట్‌లో ఓటింగ్‌ను బహిష్కరించారు. మరోవైపు పీటీఐ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న షా మెహమ్ముద్‌ ఖురేషీ ఈ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా షెహబాజ్‌కు మార్గం సుగమమైంది.

Also Read:

Modi-Biden: ఫ్రదాని మోదీతో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వర్చువల్ భేటీ.. ప్రధాన ఎజెండా అదేనా?

Pakistan New PM: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్‌ ఏకగ్రీవం.. నేషనల్ అసెంబ్లీ నుంచి PTI ఎంపీల వాకౌట్