PM Narendra Modi: దేశ భద్రతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలపై చర్చ..

|

Mar 13, 2022 | 4:51 PM

మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.

PM Narendra Modi: దేశ భద్రతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమావేశం.. కీలక నిర్ణయాలపై చర్చ..
Pm Modi
Follow us on

PM Modi chairs high-level meeting: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం 18 రోజులుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో రష్యా సైన్యం.. ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించడం ప్రధాన్యం సంతరించుకుంది. దేశ భద్రత, రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంపై చర్చించారు. ఈ స‌మావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంక‌ర్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, జాతీయ భద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ అధికారులు పాల్గొన్నారు. ర‌ష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య జరుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో దేశ భద్రత, ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ప‌రిణామాల‌పై ఈ స‌మావేశంలో చర్చించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉండనుందనే అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులు, మంత్రులను అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఖర్కివ్‌లో చనిపోయిన కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహాన్ని వెనక్కి తెచ్చేందుకు అన్నివిధాలుగా ప్రయత్నాలు చేయాలని ప్రధాని ఈ సందర్భంగా అధికారును ఆదేశించారు.

కాగా.. అంతకుముందు రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ర‌ష్యా, ఉక్రెయిన్‌.. రెండు దేశాల‌తోనూ భార‌త్‌కు అవ‌స‌రాలున్నాయ‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ‌కీయంగా, ఆర్థికంగా, భద్రతా, విద్యా ప‌రంగా భార‌త్ ఈ రెండు దేశాల‌తోనూ సంబంధాల‌ను క‌లిగి ఉందంటూ వెల్లడించారు. అయితే భార‌త్ మాత్రం శాంతినే కోరుకుంటుంద‌ని, రెండు దేశాలు కూడా సామరస్యంగా పరిష్కారించుకోవాలని సూచించారు. దీంతోపాటు ఇటీవల జెలెన్‌స్కీ, పుతిన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఇద్దరు మాట్లాడుకొని యుద్ధాన్ని ముగించాలని సూచించారు.

Also Read:

AAP MLA Mother: పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఓడించిన ఆప్ ఎమ్మెల్యే తల్లి ఏం చేస్తారో తెలుసా?

EPF Interest Rate: పీఎఫ్ వడ్డీ రేటు తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కు లేఖ.. బీజేపీ నిజస్వరూపం ఇదేనంటూ ఎంపీ ఫైర్