అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఉత్తరాదితోపాటు.. దక్షిణాదిలో రాముడితో ముడిపడి ఉన్న పుణ్య క్షేత్రాలను ప్రధాని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 11 రోజులపాటు ఉపవాసం ఉంటూ.. ఆలయాలను దర్శించుకుంటున్నారు. దీనిలో భాగంగా ప్రధాని మోదీ శనివారం తమిళనాడులో పర్యటించారు. ముందుగా శ్రీరంగానికి చేరుకున్న ప్రధాని మోదీ.. రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్త్రాల్లో రంగనాథ స్వామి వారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించి రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. రుద్రాక్షమాలతో జపం చేస్తూ సముద్రంలో స్నానం చేశారు. అంతేకాకుండా ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకుని పవిత్ర స్నానమాచరించారు. అనంతరం రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భజనల్లో పాల్గొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi offers prayers at Sri Arulmigu Ramanathaswamy Temple in Rameswaram, Tamil Nadu. The Prime Minister also took a holy dip into the sea here. pic.twitter.com/v7BCSxdnSk
— ANI (@ANI) January 20, 2024
అయితే, రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతం రామేశ్వరం.. రావణాసురుడిని వధించిన తర్వాత రాముడు పాపాన్ని పోగొట్టుకునేందుకు ఇక్కడి సముద్ర తీరంలో శివలింగాన్ని తయారుచేసి పూజించాడని నమ్ముతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రామనాథస్వామి ఆలయంలోని శివలింగం ఒకటి. ఏడాది పొడవునా లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి అగ్నితీర్థం సహా 22 తీర్థ బావుల్లోని పుణ్య జలాలను అయోధ్య రామ మందిరానికి తీసుకెళ్లారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..