భారత ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని రకాబ్‌గంజ్ గురుద్వారాను డిసెంబర్ 20న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గురు తేగ్‌బహదూర్ సింగ్‌కు నివాళులు అర్పించారు. కాగా, ప్రధాని సందర్శన కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. అయితే అకస్మాత్తుగా గురుద్వారాను సందర్శించి ప్రధాని అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో గురు తేగ్ బహదూర్ సింగ్ సేవలను కొనియాడారు. గురు తేగ్ బహదూర్ సింగ్ జీవితం ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఆయన ధైర్యం, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం అని తెలిపారు. గురు తేగ్ బహదూర్ తరహాలోనే సమాజాభివృద్ధికి కృషి చేస్తామని ప్రధాని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. దేశంలో జరుగుతున్న ఆందోళనలోనూ సిక్కు రైతులే ముందున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ముఖ్యమైన గురుద్వారాల్లో ఒకటైన రకాబ్‌గంజ్ గురుద్వారాను ప్రధాని సందర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది.
It is the special Kripa of the Guru Sahibs that we will mark the special occasion of the 400th Parkash Parv of Sri Guru Teg Bahadur Ji during our Government’s tenure.
Let us mark this blessed occasion in a historic way and celebrate the ideals of Sri Guru Teg Bahadur Ji. pic.twitter.com/GBiWMyih6D
— Narendra Modi (@narendramodi) December 20, 2020