భారత ఆర్థిక వృద్ధి రేటు జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతోంది. మేకిన్ ఇండియా నినాదం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. కారణం ఏదైనా దేశ ఆర్థిక రంగంలో భారీగా వృద్ధికనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మైలును దాటింది. గతంతో పోల్చితే అత్యధికంగా నమోదై సరికొత్త రికార్డును సృష్టించింది.
మార్చి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. దీంతో వార్షిక వృద్ధిరేటు 8.2 శాతనికి ఎగబాకింది. ఇదిలా ఉంటే డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 8.6 శాతం కన్నా తక్కువగా ఉన్నప్పటికీ.. గతేడాది జనవరి-మార్చితో పోలిస్తే మెరుగైన ఫలితాలు నమోదుకావడం విశేషం. కాగా 2022-23 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి కాలంలో జీడీపీ 6.2 శాతంగా నమోదైంది.
ఇదిలా ఉంటే 2022-23 ఏడాదిలో 7 శాతంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2% వృద్ధి చెందిందని NSO డేటా వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ రేటు 7.7 శాతంగా అంచనా వేసింది. అయితే, NSO రెండవ ముందస్తు అంచనాను కూడా అధిగమించి 2023-24 వార్షిక వృద్ధిరేటు 8.2గా నమోదుకావడం విశేషం. తయారీ రంగం బలమైన పనితీరు కారణంగా గతేడాదితో పోల్చితే మంచి వృద్ధిరేటు నమోదైంది. 2024 మొదటి మూడు నెలల్లో చైనా 5.3% ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది, అదే కాలంలో భారతదేశం యొక్క బలమైన ఆర్థిక పనితీరును హైలైట్ చేస్తుంది.
The Q4 GDP growth data for 2023-24 shows robust momentum in our economy which is poised to further accelerate. Thanks to the hardworking people of our country, 8.2% growth for the year 2023-24 exemplifies that India continues to be the fastest growing major economy globally. As…
— Narendra Modi (@narendramodi) May 31, 2024
దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ.. 2023-24 ఏడాదికి సంబంధించి క్యూ4 జీడీపీ వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ప్రదర్శనను చూపుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగవంతం కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు, 2023-24 సంవత్సరానికి 8.2% వృద్ధి చెందడం చూస్తుంటే.. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని ఉదాహరణగా చెప్పవచ్చని మోదీ అన్నారు. తాను చెప్పినట్లు దేశాభివృద్ధికి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..