Assembly Polls 2023: ఆదివారం త్రిపుర, మేఘాలయలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..

|

Dec 17, 2022 | 4:33 PM

భారత దేశంలోని 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది మార్చిలో పోలింగ్స్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధాని..

Assembly Polls 2023: ఆదివారం త్రిపుర, మేఘాలయలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..
Pm Modi To Visit Tripura And Meghalaya
Follow us on

భారత దేశంలోని 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. ఈ క్రమంలోనే త్రిపుర, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది మార్చిలో పోలింగ్స్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పర్యటించి అక్కడ దాదాపు రూ.6800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో హౌసింగ్, రోడ్లు, వ్యవసాయం, టెలికాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ శాఖ), టూరిజం, హాస్పిటాలిటీ వంటి పలు రంగాలకు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ఈ మేరకు పీఎంఓ తాజాగా ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారని దానితో పాటు షిల్లాంగ్‌లో జరిగే సమావేశానికి కూడా ఆయన హాజరవుతారని ప్రధానమంత్రి కార్యాలయం  తెలిపింది. ప్రధాని మోదీ పర్యటనలో బాగంగా.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అండ్ రూరల్ పథకం కింద త్రిపురలోని అగర్తలాలో రెండు లక్షల మందికి పైగా లబ్ధిదారుల కోసం ‘గృహ ప్రవేశ్’ను మోదీ ప్రారంభించనున్నారు.

‘‘1972 నవంబర్ 7న నార్త్-ఈస్ట్ కౌన్సిల్(ఈశాన్య మండలి)ని  అధికారికంగా ప్రారంభించారు. ప్రాంతీయంగా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం ద్వారా  సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ఈశాన్య మండలి గణనీయమైన పాత్ర పోషించింద’’ని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఇంకా ‘‘విద్య, ఆరోగ్యం, క్రీడలు, నీటి వనరులు, వ్యవసాయం, పర్యాటకం, పరిశ్రమలు వంటి రంగాలలో విలువైన మూలధనం, సామాజిక మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు ఈశాన్య మండిలి కృషిచేసింద’’ని కూడా ప్రధాని కార్యాలయం పేర్కొంది. మోదీ తన పర్యటనలో భాగంగా 2450 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది.

త్రిపురకు 4350 కోట్ల ప్రాజెక్టుల బహుమతి..

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగు రోడ్డు ప్రాజెక్టులతో సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలను  ప్రారంభించనున్నారు. వాటితో పాటు త్రిపురలోని ఉమ్సావలిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) షిల్లాంగ్‌ను మోదీ ప్రారంభించనున్నారు. అలాగే మేఘాలయలోని మష్రూమ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో స్పాన్ లాబొరేటరీ అండ్ ఇంటిగ్రేటెడ్ తేనెటీగల పెంపకం అభివృద్ధి కేంద్రాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. దీంతో పాటు మిజోరాం, మణిపూర్, త్రిపుర, అస్సాంలలో 21 హిందీ గ్రంథాలయాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. త్రిపురలో సుమారు రూ.4350 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.

ఇవి కూడా చదవండి

32 రోడ్లకు శంకుస్థాపన..

ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన కింద 230 కి.మీ కంటే ఎక్కువ పొడవుతో మొత్తం 32 రోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. వాటితో పాటుగానే 540 కి.మీ కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేసే 112 రోడ్లను మెరుగుపరచేందుకు మరో ప్రాజెక్ట్‌కు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఆనంద్‌నగర్‌లో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, అగర్తల ప్రభుత్వ డెంటల్ కాలేజీకి కూడా ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో అంటే మార్చి నెలలో త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక త్రిపురలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉండగా.. మేఘాలయలో బలాన్ని పెంచుకునేందుకు  ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాలతో  నాగాలాండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణల్లో కూడా 2023లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..