PM Modi TN Tour: వరస పర్యటనలతో ప్రధాని బిజీబిజీ.. నేడు తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

|

Jan 02, 2024 | 7:41 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండు స్థాయి అంతర్జాతీయ టెర్మినల్ ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఏటా 4.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోడీ పాల్గొంటారు.

PM Modi TN Tour: వరస పర్యటనలతో ప్రధాని బిజీబిజీ.. నేడు తమిళనాడులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
Pm Modi Tn Tour
Follow us on

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుస పర్యటనల్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు, రేపు తమిళనాడు, లక్షద్వీప్‌, కేరళలో పర్యటించనున్నారు. 19,850 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు విమానయానం, రైలు, రోడ్డు, చమురు, గ్యాస్, షిప్పింగ్, ఉన్నత విద్య వంటి వివిధ రంగాలలో విస్తరించి ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు తమిళనాడులో పర్యటించనున్నారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో 1,112 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ రెండు స్థాయి అంతర్జాతీయ టెర్మినల్ ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో ఏటా 4.4 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తిరుచిరాపల్లిలోని భారతీదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవ వేడుకల్లో కూడా మోడీ పాల్గొంటారు. యూనివర్శిటీ హాల్‌లో 33 మందికి పట్టాలను ప్రదానం చేశాక ప్రసంగిస్తారు. రెండు కార్యక్రమాల్లోనూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాల్గొంటారు.

మరోవైపు పర్యటనలో భాగంగా ప్రధాని తమిళనాడు బీజేపీ నేతలతో సమావేశమతారని సమాచారం. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా పరిశీలించడంతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారని తెలిసింది.

ఆ తర్వాత ప్రధాని మోదీ లక్షద్వీప్‌లోని అగట్టికి చేరుకుంటారు, అక్కడ బహిరంగ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. జనవరి 3వ తేదీ మధ్యాహ్నం కవరత్తి, లక్షద్వీప్‌కు చేరుకుని, టెలికమ్యూనికేషన్స్, తాగునీరు, సోలార్ పవర్, ఆరోగ్యం వంటి రంగాలలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీ రేపు కేరళలోని త్రిసూర్‌ సందర్శించనున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, ఫ్లెక్సీలు, జెండాలను త్రిసూర్‌ మున్సిపాలిటి సిబ్బంది తొలగించారు. దీన్ని నిరసిస్తూ బీజేపీ శ్రేణులు త్రిసూర్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎం బోర్డులు, ఫ్లెక్సీలకు వర్తించని నిబంధనలు బీజేపీకి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. మరోవైపు మోడీ త్రిసూర్‌ పర్యటన నేపథ్యంలో మహిళా మోర్చా కార్యకర్తలు మెగా తిరువథిర పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సుమారు రెండు వేల మంది సంప్రదాయ నృత్యాలు అభ్యాసం చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..