Parakram Diwas: రియల్ హీరోలకు ప్రధాని మోడీ సలాం.. నేతాజీ జయంతి సందర్భంగా 21 దీవులకు ఆ వీరుల పేర్లు..

నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని..

Parakram Diwas: రియల్ హీరోలకు ప్రధాని మోడీ సలాం.. నేతాజీ జయంతి సందర్భంగా 21 దీవులకు ఆ వీరుల పేర్లు..
Parakram Diwas
Follow us

|

Updated on: Jan 21, 2023 | 8:33 PM

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని కేంద్ర ప్రభుత్వం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. ఏటా జనవరి 23న పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోంది. ఈ ఏడాది పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను.. అండమాన్ అండ్‌ నికోబార్ దీవులలోని పేరు లేని అతిపెద్ద 21 దీవులకు వారి పేర్లను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు.  సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే పరాక్రమ్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని.. 21 అతిపెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లు పెడతారని ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా ప్రధాని ఆవిష్కరిస్తారని పీఎంఓ తెలిపింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. అండమాన్ – నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు. నీల్ ద్వీపం, హేవ్‌లాక్ ద్వీపాన్ని షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్‌గా పేర్లను ప్రకటించారు.

దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన నిజమైన హీరోలకు నివాళులు అర్పించే విషయంలో.. వారికి సముచిత ప్రాధాన్యం కల్పించే విషయంలో ప్రధానమంత్రి మోడీ ఎల్లప్పుడూ ముందుంటారు. ఈ స్పూర్తికి అనుగుణంగా ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అండమాన్‌ ద్వీప సమూహంలోని 21 పెద్ద పేరులేని ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేరు పెట్టాలని నిర్ణయించినట్లు పీఎంఓ పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన వీరులకు ఇదే ఘనమైన నివాళి అంటూ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఇవే..

ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్నారు.

  1. మేజర్ సోమనాథ్ శర్మ
  2. సుబేదార్ – హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్
  3. 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే
  4. నాయక్ జాదునాథ్ సింగ్
  5. కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్
  6. కెప్టెన్ GS సలారియా
  7. లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా
  8. సుబేదార్ జోగిందర్ సింగ్
  9. మేజర్ షైతాన్ సింగ్
  10. సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్
  11. లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్
  12. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
  13. మేజర్ హోషియార్ సింగ్
  14. 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్
  15. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్
  16. మేజర్ రామస్వామి పరమేశ్వరన్
  17. నాయబ్ సుబేదార్ బనా సింగ్
  18. కెప్టెన్ విక్రమ్ బాత్రా
  19. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
  20. సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్ మాన్) సంజయ్ కుమార్
  21. సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.. ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు