PM MODI: దక్షిణాది రాష్ట్రాల ప్రధాని మోదీ టూర్ ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై సర్వత్రా ఆసక్తి..

|

Nov 11, 2022 | 9:42 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే ఆయన పర్యటన ప్రారంభం కాగా.. ఉదయం కర్ణాటక, మద్యాహ్నం తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్‌..

PM MODI: దక్షిణాది రాష్ట్రాల ప్రధాని మోదీ టూర్ ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై సర్వత్రా ఆసక్తి..
PM NarendraModi arrives in Bengaluru received by Karnataka governor ThawarChandGehlot and CM BasavarajBommai
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల దక్షిణాది రాష్ట్రాల పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే ఆయన పర్యటన ప్రారంభం కాగా.. ఉదయం కర్ణాటక, మద్యాహ్నం తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి సాయంత్రానికి ఆంధ్రప్రదేశ్‌ చేరుకుంటారు. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో, మద్యాహ్నం తెలంగాణ జిల్లాలో ప్రధానమంత్రి పర్యటిస్తారు. ప్రధాని నరేంద్రమోదీ తన పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కర్ణాటకలో. బహిరంగసభలు, బీజేపీ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. కర్ణాటకతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది. బెంగళూర్‌ చేరుకున్న ప్రధాని అక్కడ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండో టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కెఎస్‌ఆర్‌ రైల్వే స్టేషన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను, భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలును ప్రారంభిస్తారు. బెంగళూరులో 108 అడుగుల నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు మోదీ.. కర్ణాటక పర్యటన ముగించుకుని మద్యాహ్నం తమిళనాడు చేరుకుంటారు. దిండిగల్‌లో గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్ 36వ స్నాతకోత్సవ వేడుకల్లో నరేంద్రమోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా 2018-19, 2019-20 బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పట్టాలు అందజేస్తారు.

తమిళనాడు పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి 7.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు.. విమనాశ్రయం నుంచి ENC చోళాకు చేరుకుంటారు.. రాత్రి ఏడున్నరకు మారుతి జంక్షన్- సింథియా రోడ్ లో కిలోమీటర్ మేర రోడ్డు షో ఉంటుంది. రాత్రి 8. 00 గం. కు అతిధి గృహం చోళాకు చేరుకునే మోదీ అక్కడ బీజేపీ కోర్‌ కమిటీ మీటింగ్‌లో పాల్గొంటారు.. ఆ తర్వాత 8.30 గంటలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అవుతారు.

రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి. వీఐపీ అపాయింట్మెంట్స్‌ పూర్తి చేసుకొని ఉదయం 10.10 గంటలకు హెలికాఫ్టర్ లో ఆంధ్రా యూనివర్సిటీ కి బయలుదేరతారు.. పదిన్నరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే సభలో వర్చువల్ గా 9 ప్రాజెక్టుల శంఖుస్థాపన, 2 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేస్తారు. . 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్‌ నవీకరణ, ఈస్ట్‌కోస్టు జోన్‌ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన చేస్తారు. 260 కోట్ల రూపాయలతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్‌ వర్క్ షాపు, ఐఐఎం పరిపాలన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. 152 కోట్ల రూపాయ వ్యయంతో చేపట్టనున్న చేపలరేవు నవీకరణ ప్రాజెక్టు, 560 కోట్ల రూపాయల ఖర్చుతో కాన్వెంట్‌ కూడలి నుంచి షీలానగర్‌ వరకు పోర్టు రహదారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేస్తారు. విశాఖపట్టణం పర్యటన ముగించుకుని తెలంగాణకు వెళ్తారు. రామగుండంలో ఉన్న RFCL ప్లాంట్‌ను ప్రధాని సందర్శించి దానిని జాతికి అంకితం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..