PM Modi: శ్రీరాముడి పవిత్రభూమికి రావడం నా అదృష్టం.. తమిళనాడు గడ్డపై రెండోరోజు ప్రధాని మోదీ!

తమిళనాడు గడ్డపై ప్రధాని మోదీ రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఆదివారం అరియలూర్ జిల్లాలోని గంగైకొండ రాజరాజచోళ టెంపుల్‌ని సందర్శిస్తారు. ఆయలంలో ప్రత్యేక పూజలు తర్వాత మోదీ బహిరంగసభకు హాజరవ్వనున్నారు.

PM Modi: శ్రీరాముడి పవిత్రభూమికి రావడం నా అదృష్టం.. తమిళనాడు గడ్డపై రెండోరోజు ప్రధాని మోదీ!
Pm Modi

Updated on: Jul 27, 2025 | 9:28 AM

రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ తమిళనాడులో ఉన్నారు. శనివారం టూర్‌లో భాగంగా ప్రధాని మోదీ తూత్తుకుడి ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్‌ని ప్రారంభించారు. దీంతో పాటు 2 వేల 500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం అరియలూర్ జిల్లాలోని గంగైకొండ రాజరాజచోళ టెంపుల్‌ని మోదీ సందర్శిస్తారు. సందర్భం ఏంటంటే.. రాజేంద్ర చోళుడు గంగాప్రాంతంపై విజయం సాధించి వెయ్యేళ్లు పూర్తవ్వడం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని కూడా ఆవిష్కరిస్తారు.

ఇక ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రధాని మోదీ వస్తుండడంతో సమీప ప్రాంతాల్లో మొత్తం పటిష్ట భత్రను ఏర్పాటు చేశారు. డాగ్‌ స్క్వాడ్స్‌తో సభా ప్రాంగణాన్ని మొత్తం తనిఖీలు జరుపుతున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు చేపట్టారు.

ఇక శనివారం తమిళనాడు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ  పంచకట్టుతో తమిళనాడు గడ్డపై అడుగుపెట్టాడు. నాలుగు రోజుల విదేశీ పర్యటన తర్వా ఆ శ్రీరామచంద్రుడి పవిత్ర భూమికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాప చేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ..  తమిళనాడు ప్రజలకు రెండు ప్రధాన రహదారి ప్రాజెక్టులను అంకితం చేశామని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.