PM Modi: ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్..

ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. ఇరాన్‌లోని మౌలిక స్థావరాలపై దాడులను మోదీ ఖండించారు. ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటంపై, యుద్ధంలో పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయుల భద్రతతో పాటు ఇంధన, సరకు రవాణాకు అడ్డంకులు ఏర్పడకుండా చూసేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.

PM Modi: ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్..
Iran President Masoud Pezeshkian - PM Narendra Modi

Updated on: Mar 21, 2026 | 4:27 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈద్, నౌరూజ్ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై చర్చించారు. “ఈ పండుగల కాలం ఆ ప్రాంతానికి శాంతి, స్థిరత్వం, అభివృద్ధి తీసుకురావాలని ఆశిస్తున్నాం” అని మోదీ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఆ ప్రాంతంలో కీలక మౌలిక వసతులపై జరుగుతున్న దాడులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై కూడా ప్రభావం చూపుతున్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాక, ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల భద్రతపై మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. “నావిగేషన్ స్వేచ్ఛను కాపాడడం అత్యంత అవసరం. రవాణా మార్గాలు ఎప్పుడూ తెరిచి, భద్రంగా ఉండాలి” అని ఆయన అన్నారు.

పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రాంతీయ శాంతి, ప్రపంచ వాణిజ్య రక్షణపై భారత్ తన ఆందోళనలను స్పష్టంగా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

 

Follow Us