ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్(Shehbaz Sharif) వచ్చే నెలలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం SCO శిఖరాగ్ర సమావేశంలో సందర్భంగా కలిసే అవకాశం ఉంది. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో సెప్టెంబర్ 15-16 తేదీలలో జరగనుంది. ఈ సమావేశంలో పీఎం నరేంద్ర మోదీ, పాక్ పీఎం షాబాజ్ షరీఫ్ పాల్గొంటారని ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరూ భేటీ కావచ్చని భావిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య అధికారికంగా భేటీ అయ్యే అవకాశాలు కనిపిండం లేదు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల ప్రధానుల మధ్య అధికారిక సమావేశం జరగలేదు.
జీ జిన్‌పింగ్, పుతిన్‌లు కూడా కలుసే ఛాన్స్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కూడా సమర్‌కండ్‌లో జరిగే అదే సమావేశానికి హాజరుకానున్నారు. వీరిద్దరూ సమావేశాలకు వస్తే.. ఈ ఇద్దరు నేతలలు కూడా సమావేశం కావచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్‌ను గాల్వన్ వ్యాలీ ఘటన తర్వాత జీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ కలవలేదు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం..