PM Modi: ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటో చూసి ఆస్ట్రేలియన్ మంత్రి షాక్.. అందులో ఉన్నది ఎవరో తెలుసా..

ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటక శాఖ మంత్రి డాన్ ఫారెల్‌తో సమావేశం ముగిసిన తర్వాత ఈ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య గొప్ప సాంస్కృతిక..

PM Modi: ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటో చూసి ఆస్ట్రేలియన్ మంత్రి షాక్.. అందులో ఉన్నది ఎవరో తెలుసా..
PM Modi

Updated on: Mar 12, 2023 | 7:55 PM

ఆస్ట్రేలియాతో ఉన్న అనుబంధాన్ని మరోసారి పంచుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం ఆస్ట్రేలియా వాణిజ్యం, పర్యాటక శాఖ మంత్రి డాన్ ఫారెల్‌తో సమావేశం ముగిసిన తర్వాత ఈ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. రెండు దేశాల మధ్య గొప్ప సాంస్కృతిక సంబంధం ఉందంటూ గుర్తు చేశారు. తన భారతీయ ఉపాధ్యాయురాలి పట్ల ఆస్ట్రేలియా మంత్రికి ఉన్న అభిమానాన్ని వివరిస్తూ, ప్రధాని మోదీ తన టీచర్ Mrs Ebert 1950లలో గోవా నుంచి అడిలైడ్‌కు వలస వచ్చి దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని నగరంలో ఒక పాఠశాలలో బోధించడం ప్రారంభించారని వెల్లడించారు. ప్రధాని మోదీ షేర్ చేసిన ఫోటో చూసి ఉబ్బితబ్బిబైన ఆస్ట్రేలియన్ మంత్రి. ఆ ఫోటోలో ఉన్నది తన చిన్ననాటి క్లాస్ టీచర్ కావడంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అంతే కాదు ఆ టీచర్‌కు భారత్‌తో ఉన్న అనుబంధాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

శ్రీమతి ఎబర్ట్, ఆమె భర్త, ఆమె కుమార్తె లియోనీ 1950లలో గోవా నుంచి ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు వలసవెళ్లి అక్కడి పాఠశాలలో బోధించడం ప్రారంభించారని ఆయన తెలిపారు. ఆ తర్వాత ఆమె కూతురు లియోనీ సౌత్ ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్స్ అధ్యక్షురాలిగా ఎదిగాకరి ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

భారత్- ఆస్ట్రేలియా మధ్య గొప్ప సాంస్కృతిక సంబంధాన్ని నొక్కిచెప్పే ఈ వృత్తాంతాన్ని వినడం పట్ల ప్రధాన మంత్రి తన ఆనందాన్ని వెల్లడించారు .”ఎవరైనా తన గురువును అభిమానంగా పరామర్శించినప్పుడు వినడం కూడా అంతే సంతోషాన్నిస్తుంది” అని ప్రధాని మోదీ అన్నారు.

ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అల్బనీస్ కలిసి పనిచేయాలని ఉందన్నారు ప్రధాని మోదీ. భారత్-ఆస్ట్రేలియా మొదటి వార్షిక శిఖరాగ్ర సమావేశంలో శుక్రవారం ప్రధాని మోదీ తన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన ఉగ్రవాద సంస్థలపై సంఘటిత చర్యలు తీసుకోవడానికి, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు దోహదపడేందుకు కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. టెర్రర్ ఫైనాన్సింగ్‌ను ఎదుర్కోవడం అనే అసలైన సమస్య అని గుర్తు చేశారు.

మరన్ని జాతీయ వార్తల కోసం