Lumpy Skin Disease: పశువులలో లంపి స్కిన్ డిసీజ్ (LSD) కట్టడికి రాష్ట్రాలతో పాటు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలిపారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్‌కు స్వదేశీ వ్యాక్సిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారని ప్రధాని పేర్కొన్నారు. గ్రేటర్‌నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ (IDF WDS)- 2022లో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. లంపి స్కిన్ కారణంగా పాడి పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని అదుపులో ఉంచేందుకు జంతువుల కదలికలను ట్రాక్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగంగా స్వదేశీ వ్యాక్సిన్‌ను భారత సైంటిస్టులు సిద్ధం చేశారని పేర్కొన్నారు. జంతువులకు టీకాలు వేయడం లేదా మరేదైనా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పాడి పరిశ్రమకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని భరోసా ఇచ్చారు.
తగ్గిన పాల ఉత్పత్తి..
కాగా లంపి స్కిన్ డిసీజ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57,000 పశువులు చనిపోయాయని కేంద్రం గత వారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వ్యాధి బారిన పడి కేవలం రాజస్థాన్‌లో మాత్రమే దాదాపు 37,000 మూగజీవాలు మరణించాయి. రాజస్థాన్‌తో పాటు గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ కలకలం రేపుతోంది. కాగా మొదట ఐరోపాలో బయటపడిన ఈ వ్యాధి ఆతర్వాత ఆసియాకు కూడా వ్యాపించింది. 2019 లో బంగ్లాదేశ్‌లో లంపిస్కిన్ డిసీజ్ కేసులు వెలుగుచూశాయి. ఆ మరుసటి ఏడాదే ఇండియాలో మొదటి కేసు నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశంలో 2019లో 192.5 మిలియన్ల పశువుల జనాభాను కలిగి ఉంది. అయితే లంపి స్కిన్ వ్యాధి బయటపడినప్పటి నుంచి పాల సేకరణలో తగ్గుదల కనిపిస్తోంది.
లంపి స్కిన్ డిసీజ్ అంటే?
లంపి స్కిన్ డిసీజ్ అనేది ఒక అంటువ్యాధి అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా. దీని బారిన పడిన పశువులలో తీవ్ర జ్వరంతో పాటు చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఒక్కోసారి తీవ్రత ఎక్కువై మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వ్యాధి దోమలు, ఈగలు, పేనులు, కందిరీగల ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అలాగే కలుషితమైన ఆహారం, నీటి ద్వారా కూడా వ్యాపిస్తుంది.
Speaking at inauguration of International Dairy Federation World Dairy Summit 2022 in Greater Noida. https://t.co/yGqQ2HNMU4
— Narendra Modi (@narendramodi) September 12, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..