PM Modi: ‘పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను’.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రిస్మస్ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అనేక మంది పిల్లలు తమ గాత్రంతో అందమైన పాటలు పాడారు. ఈ క్రమంలోనే ఆ పిల్లలందరికీ ప్రధాని మోదీ తన నివాసాన్ని కలియతిరగడానికి అవకాశం కల్పించారు.

PM Modi: పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..
PM Modi

Updated on: Dec 27, 2023 | 1:27 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో క్రిస్మస్ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అనేక మంది పిల్లలు తమ గాత్రంతో అందమైన పాటలు పాడారు. ఈ క్రమంలోనే ఆ పిల్లలందరికీ ప్రధాని మోదీ తన నివాసాన్ని కలియతిరగడానికి అవకాశం కల్పించారు.

వారితో ముందుగా ముచ్చటించిన ప్రధాని మోదీ.. ‘దేశ ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని మీరెప్పుడైనా సందర్శించారా’ అని ప్రశ్నించారు. ఇక ఆ పిల్లలు ‘నో’ అని జవాబిచ్చారు. దానితో ‘మీ అందరికీ నా వ్యక్తిగత సిబ్బంది.. ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని అంతా తిప్పి చూపిస్తారు అని హామీ’ మోదీ చెప్పారు.

కాగా, తన నివాసానికి వచ్చిన అనుకోని అతిధుల పట్ల సంతోషం వ్యక్తం చేసిన పీఎం మోదీ ట్విట్టర్ వేదికగా.. ”ఎంతో దూరం నుంచి ప్రయాణించి 7ఎల్‌కేఎం వచ్చిన ఈ పిల్లలు.. సరికొత్త అనుభూతిని పొందారు. నా ఆఫీస్ అంతిమ పరీక్ష ఉత్తీర్ణత సాధించినట్టు అనిపిస్తోంది. వారు దానికి ‘థంబ్స్ అప్’ ఇచ్చారు” అని పేర్కొన్నారు.