PM Modi: మా మేనిఫెస్టో కర్ణాటకను నెంబర్‌ వన్‌గా చేస్తుంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

|

May 02, 2023 | 1:52 PM

కర్ణాటకలో ప్రధాని మోడీ మరోసారి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. చిత్రదుర్గలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు మోడీ. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సంకల్ప్‌పత్రను విడుదల చేశామన్నారు. చిత్రదుర్గ సభలో కార్యకర్తలను ఉత్సాహపర్చారు ప్రధాని మోడీ.

PM Modi: మా మేనిఫెస్టో కర్ణాటకను నెంబర్‌ వన్‌గా చేస్తుంది.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
Pm Modi In Karnataka
Follow us on

కర్ణాటకలో ప్రధాని మోడీ మరోసారి సుడిగాలి ప్రచారం నిర్వహించారు. చిత్రదుర్గలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు మోడీ. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా సంకల్ప్‌పత్రను విడుదల చేశామన్నారు. చిత్రదుర్గ సభలో కార్యకర్తలను ఉత్సాహపర్చారు ప్రధాని మోడీ. దీంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడీ కర్ణాటకను దేశంలో నెంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బీజేపీ మేనిఫెస్టో ఉందన్నారు. యువతకు , మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్టు తెలిపారు. కాగా మే10న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కర్ణాటకలో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతుండగా.. మళ్లీ సత్తాచాటాలని కాంగ్రెస్, జేడీఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీని మళ్లీ గెలిపించేందుకు రంగంలోకి దిగారు ప్రధాని మోడీ. వీలైనంతవరకు ఎక్కువ ప్రాంతాలను కవర్‌ చేసేలా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం మైసూరులో మెగా రోడ్‌షో నిర్వహించారు మోడీ. ఈ సందర్భంగా ఆరు బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మొత్తం 16 హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ‘ప్రజాధ్వని’ అనే పేరుతో విడుదల చేసిన ఈ మ్యాని ఫెస్టోలో భాగంగా మహిళలపై ప్రధానంగా దృష్టి సారించింది. అధికారంలోకి వస్తే బెంగళూరు అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారి సమస్యలు చక్కదిద్దుతామని కన్నడ ప్రజలకు హామీ ఇచ్చింది కమల పార్టీ. అలాగే దారిద్య్రరేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు, రోజు అర లీటరు నందిని పాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. నెలవారీ రేషన్‌లో భాగంగా ఐదు కిలోల సిరిధాన్యాలు అందజేస్తామని ఓటర్లకు బీజేపీ హామీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..