PM Modi Bhutan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు బయలుదేరారు. శుక్రవారం ఉదయాన్నే ప్రధాని మోదీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో వెళ్లారు. వాస్తవానికి ప్రధాని మోదీ భూటాన్ లో మార్చి 21-22 తేదీలలో పర్యటన కోసం గురువారం వెళ్లాల్సి ఉంది. అయితే, భూటాన్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పర్యటన వాయిదా పడింది. దీంతో పర్యటన తేదీని త్వరలో ప్రకటిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ కు బయలుదేరి వెళ్లారు. పారో విమానాశ్రయంలో కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన వాయిదా పడినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇరుదేశాలు పరస్పరం చర్చించుకున్న అనంతరం.. వెనువెంటనే కొత్త తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా.. మోదీ ఇవాళ, రేపు భూటాన్ లో పర్యటించి.. ద్వైపాక్షిక అంశాలు, ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు.
భారతదేశం – భూటాన్‌ల మధ్య సాధారణ ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగుపర్చేందుకు, ‘నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ’ లో భాగంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ.. భూటాన్ రాజుతో చర్చించనున్నారు. తన పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్, భూటాన్ నాల్గవ రాజు హిస్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్‌చుక్‌లతో భేటీ అవుతారు.
Delhi: Prime Minister Narendra Modi leaves for Bhutan.
PM Modi will be on a state visit to Bhutan on March 22-23. pic.twitter.com/Z7wTR5qjQA
— ANI (@ANI) March 22, 2024
అంతేకాకుండా.. ప్రధాని మోదీ భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్‌గేతో కూడా చర్చలు జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
భూటాన్‌లో పర్యటన సందర్భంగా గ్యాల్ట్‌సున్ జెట్సన్ పెమా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. Gyaltsuen Jetsun Pema మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు.
ఈ నెల ప్రారంభంలో, భూటాన్ ప్రధాని ఐదు రోజుల భారత్ పర్యటనలో ఉన్నారు. జనవరిలో అత్యున్నత పదవిని చేపట్టిన తర్వాత ఇది ఆయన తొలి విదేశీ పర్యటన. తన పర్యటనలో ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అంతేకాకుండా ప్రధాని మోదీని కలిసి పలు విషయాలపై చర్చించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..