
ఆత్మనిర్భర్ భారత్ కి గ్రామాలు మూలస్తంభాలు కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గురువారం ఆయన బీహార్ లో.. రైతులు, మత్స్యకారుల సంక్షేమానికి ఉద్దేశించిన కీలక పథకాలను ప్రకటించారు. వ్యవసాయదారుల కోసం ‘ఈ-గోపాల’ యాప్ ను లాంచ్ చేయడమే గాక, మత్స్యకారులకు ఉద్దేశించి ‘మత్స్య సంపద యోజన’ (పథకాన్ని) ప్రారంభించారు. ఈ శతాబ్దంలో నీలి విప్లవం అంటే ఫిషరీస్ అని, శ్వేత విప్లవమంటే పాడి పరిశ్రమ అని, ‘తీపి విప్లవం’ అంటే తేనె ఉత్పత్తి అని ఆయన వివరించారు. వీటివల్ల గ్రామాలు మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ను దేశంలోని 21 జిల్లాల్లో ప్రవేశపెడుతున్నామని, వచ్ఛే నాలుగైదేళ్లలో ఇందుకు 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో రూ. 1700 కోట్ల విలువైన పనులు గురువారమే ప్రారంభమైనట్టు ఆయన తెలిపారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న అక్టోబర్-నవంబరు నెలల్లో జరగవలసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలోనే ఆయన ఈ పథకాలను ప్రకటించడం విశేషం.
Delhi: PM Narendra Modi digitally launches the Pradhan Mantri Matsya Sampada Yojana (PMMSY) and e-Gopala App for farmers along with several other initiatives in the fisheries and animal husbandry sectors in Bihar. pic.twitter.com/9YVmK0AMpf
— ANI (@ANI) September 10, 2020