PM Modi – Revanth Reddy: అన్ని విధాల తోడ్పాటు అందిస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

PM Modi - Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ.

PM Modi - Revanth Reddy: అన్ని విధాల తోడ్పాటు అందిస్తా.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు
Revanth Reddy Pm Modi

Updated on: Dec 07, 2023 | 9:51 PM

PM Modi – Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తానని ట్వీట్‌లో పేర్కొన్నారు మోదీ. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రధాని మోదీ ట్వీట్

సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులకు మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి విషెష్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ రాష్ట్రం రేవంత్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

టీడీపీ నేత నారా లోకేష్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..