Minister Pralhad Joshi: ఆగస్టు 15న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు..

Parliament Monsoon Session: పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుతగలడం చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారని అన్నారు. 

Minister Pralhad Joshi: ఆగస్టు 15న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపు..
Minister Pralhad Joshi

Updated on: Jul 25, 2023 | 7:56 PM

పార్లమెంట్‌లో ప్రతిపక్షాల తీరుపై తూర్పారబట్టారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. సమావేశాలు జరుగుతున్న తీరుపై మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు అడ్డుతగలడం చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండాలనుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారని అన్నారు.  ప్రపంచం మనపై నమ్మకం ఉంచడం గర్వకారణంగా ఉందన్నారు. మూడోసారి కూడా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని అన్నారు. ఎన్‌డీఏ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గొప్ప సంకల్పంతో, విశ్వాసంతో దాన్ని సంబరాలు చేసుకుని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

సోమవారం మరణించిన ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మదన్ దాస్ దేవి, ఈ ఏడాది ప్రారంభంలో మరణించిన గిరీష్ బాపట్‌తో సహా ముగ్గురు దివంగత ఎంపీలు, రత్తన్ లాల్ కటారియాలకు నివాళులర్పించడంతో పార్టీ పార్లమెంటరీ సమావేశం ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు .

ఎన్డీయే అధికారంలోకి వచ్చి 25 ఏళ్లు అని.. ఈ కూటమి బీజేపీ సీనియర్‌ నేతలు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీల వారసత్వం అని ప్రధాని మోదీ అన్నారు. దానిని మనం జరుపుకోవాలన్నారు. ఈ సమావేశాలు నిర్వహించడం నుంచి ఆలోచనల మార్పిడి వరకు ఎన్డీయేను గొప్ప సంకల్పంతో.. విశ్వాసంతో ముందుకు తీసుకెళ్తామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ మూడవసారి అధికారంలోకి వస్తే.. దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో మూడవ ర్యాంక్‌కు చేరుకుంటుందని ప్రధాని మోదీ కూడా విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన అన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఈసారి కూడా ఆగస్టు 15న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ చెప్పారు.. మా మొదటి టర్మ్‌లో కూడా (ప్రతిపక్షం) మాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చామని, 2019లో మా సీట్లు 282 నుంచి 303కి పెరిగాయని, ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం 30 కంటే ఎక్కువ గెలుస్తామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం