భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగి కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా నేషనల్ క్రిటికల్ మినరల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ.16,300 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా 24 విలువైన ఖనిజాల తవ్వకాలకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు.
16,300 కోట్ల విలువైన మినరల్ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం(జనవరి 29) ప్రకటించారు. దీంతో పాటు సీ కేటగిరీ హెవీ బెల్లం నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్ ఎక్స్ మిల్ ధరను లీటరుకు రూ.56.28 నుంచి రూ.57.97కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
#WATCH | Delhi | Union Minister Ashwini Vaishnaw says, "The Cabinet has approved 'National Critical Mineral Mission' to build a resilient value chain for critical mineral resources vital to Green Technologies, with an outlay of Rs 34,300 crore over seven years…National Critical… pic.twitter.com/gNKAa216OP
— ANI (@ANI) January 29, 2025
2022-23 ఇథనాల్ సరఫరా సంవత్సరం (నవంబర్-అక్టోబర్) నుండి ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధరలను పెంచలేదు. చెరకు రసం, బి-భారీ బెల్లం, సి-భారీ బెల్లం నుండి ఉత్పత్తి చేసిన ఇథనాల్ ధరలు వరుసగా లీటరుకు రూ.65.61, రూ.60.73, రూ.56.28గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ధరలు సవరిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, ఇవాళ చక్కెర, ఇథనాల్‌కు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా వృద్ధి చెందాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..