భారత్-చైనా మధ్య ఉద్రిక్తత.. అజిత్ దోవల్ తో ప్రధాని మోదీ భేటీ

భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోను, డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోను సమావేశమయ్యారు, విదేశాంగ కార్యదర్శితో కూడా ఆయన వేరుగా భేటీ అయ్యారు..

భారత్-చైనా మధ్య ఉద్రిక్తత.. అజిత్ దోవల్ తో ప్రధాని మోదీ భేటీ

Edited By:

Updated on: May 26, 2020 | 6:52 PM

భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోను, డిఫెన్స్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తోను సమావేశమయ్యారు, విదేశాంగ కార్యదర్శితో కూడా ఆయన వేరుగా భేటీ అయ్యారు. మరోవైపు  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. త్రివిధ దళాధిపతులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. సిక్కిం, లడఖ్ ప్రాంతాల్లో భారత-చైనా దళాల మధ్య ఘర్షణలు క్రమంగా తీవ్రమవుతున్న సంగతి విదితమే. ఇలా ఉండగా లడఖ్ సమీపంలో చైనా ఎయిర్ బేస్ నిర్మాణ పనులను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. టర్మాక్ లో చైనా ఫైటర్ జెట్లను మోహరించినట్టు కూడా సమాచారం.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.