Viral News: పని ఇప్పించండి.. కూలీగా కూడా చేస్తా..! ఓ నిరుద్యోగి ఆవేదన.. వైరల్ అవుతున్న పోస్ట్..

|

Jun 01, 2021 | 4:59 PM

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విధిస్తోన్న లాక్‌డౌన్‌ల కారణంగా ఎంతో మంది ఉపాధి..

Viral News: పని ఇప్పించండి.. కూలీగా కూడా చేస్తా..! ఓ నిరుద్యోగి ఆవేదన.. వైరల్ అవుతున్న పోస్ట్..
7
Follow us on

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఈ మహమ్మారి కట్టడికి ప్రభుత్వాలు విధిస్తోన్న లాక్‌డౌన్‌ల కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోతున్నారు. కుటుంబాన్ని పోషించడానికి తమ స్థాయిని పక్కన పెట్టి దొరికిన పని చేస్తున్న వారి కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ కోవలోనే వికాస్ అనే యువకుడు తన కష్టాలను చెప్పుకుంటూ తాజాగా ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

”నాకు ఏదైనా పని ఇప్పించి సాయం చేయండి. ఈ లాక్‌డౌన్‌ వల్ల బతకడం కష్టంగా మారింది. లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నప్పటి నుంచి నాకు ఏ పనీ దొరకడం లేదు. ఏ పని చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాను. రోజూవారీ కూలీగా పనిచేయడానికి కూడా నేను సిద్ధమే” అంటూ దీనస్థితిలో వికాస్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల గుండెలను పిండేస్తోంది.

తాను ఢిల్లీలోని అంబేద్కర్‌ యూనివర్శిటీ నుంచి సోషియాలజీలో పీజీ చేశానని.. డ్రైవర్‌గా కూడా పని చేస్తానని.. తమకు తోచిన సాయం చేయండంటూ వికాస్ మరో ట్వీట్‌లో పేర్కొంటూ.. బస్తాలు మోస్తున్న తన ఫొటోను షేర్‌ చేయడంతో… నెటిజన్లు వరుసపెట్టి కామెంట్ల వర్షం కురిపించారు. అతడికి ధైర్యాన్ని చెబుతూ.. కొందరు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వగా.. ఇంకొందరు తప్పకుండా మంచి రోజులు వస్తాయంటూ భరోసా ఇచ్చారు. ప్రభుత్వాలకు ఇకనైనా సామాన్యుల కష్టాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

బాల్కానీలో దంపతుల ఫైట్‌.. అంతలోనే ఘోరం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకంటే..

ప్రపంచంలోనే వింతైన వంటకాలు.. చూస్తేనే వాంతి వస్తుంది.. తినడానికి కూడా ధైర్యం చెయ్యరు.!