రామ మందిర భూమి పూజపై స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం గురించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతుందని ఇప్పటికే..

రామ మందిర భూమి పూజపై స్టే కోరుతూ హైకోర్టులో పిటిషన్

Edited By:

Updated on: Jul 24, 2020 | 12:59 PM

ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం గురించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతుందని ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు బోర్డు ప్రకటించింది. అయితే ఈ పూజా కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ.. ఢిల్లీకి చెందిన సాకేత్ గోఖలే అనే న్యాయవాది అలహాబాద్‌ కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించి ఓ పిల్ దాఖలు చేశాడు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని.. అన్‌ లాక్‌ 2.0 మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. ఈ మతపరమైన కార్యక్రమంలో దాదాపు 200 మంది పాల్గొనే అవకాశం ఉందని.. అంతేకాదు వైరస్ వ్యాపించే అవకాశం ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషనర్ గతంలో పలు విదేశీ పత్రికల్లో పనిచేయడంతో పాటు.. సోషల్ వర్కర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రజారోగ్యం కోసమే తాను ఈ పిటిషన్ వేసినట్లు చెప్పుకొచ్చాడు. కాగా, అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంకా ఈ పిటిషన్‌ను అంగీకరించలేదు.