గుడ్ న్యూస్.. కరోనా ఒకసారి సోకితే మళ్లీ రాదట..!
కరోనా సోకిన వ్యక్తికి మరోసారి ఆ వైరస్ సోకుతుందా.? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా వైరస్ ఒకసారి వస్తే మళ్లీ రాదని తేలింది.

Can you get coronavirus twice: ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వివిధ దేశాల శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనిపెట్టేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే కరోనా సోకిన వ్యక్తికి మరోసారి ఆ వైరస్ సోకుతుందా.? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కరోనా వైరస్ ఒకసారి వస్తే మళ్లీ రాదని తేలింది. రెండోసారి కరోనా సోకే ఛాన్స్ తక్కువని.. సోకినట్లుగా ఆధారాలు కూడా లేవని వారు చెబుతున్నారు. కొంతమందిలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు.. వారికి మొదట సోకిన వైరస్ శరీరంపై మరోసారి ప్రభావం చూపించే అవకాశాలు ఉండొచ్చని అన్నారు. లేకపోతే ఇలాంటి లక్షణాలతో కూడిన మరో వైరస్ బారిన పడొచ్చునని అంటున్నారు. కాగా, ఒకసారి వైరస్ సోకిన వారిలో యాంటీబాడీస్ మాత్రమే కాకుండా టిసెల్స్ కూడా పోరాటం చేస్తాయని పలువురు శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..
