Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ టికెట్లు… ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌ తెస్తామన్న ఢిల్లీ సీఎం

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి డిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు త్వరలో పిక్‌ టికెట్లు తెస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌లు అందిస్తామని అన్నారు. ఈ ప్రయోజనం ఢిల్లీ నివాసితులకే పరిమితమని ప్రకటించారు. పాస్ కోసం దరఖాస్తు...

Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ టికెట్లు... ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌ తెస్తామన్న ఢిల్లీ సీఎం
Free Bus Pink Tickets

Updated on: Jul 18, 2025 | 8:15 AM

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి డిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు త్వరలో పిక్‌ టికెట్లు తెస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రకటించారు. ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌లు అందిస్తామని అన్నారు. ఈ ప్రయోజనం ఢిల్లీ నివాసితులకే పరిమితమని ప్రకటించారు. పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి, అర్హత కలిగిన దరఖాస్తుదారులు ఆధార్, పాన్, నివాస రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మరియు పూర్తి KYC డాక్యుమెంటేషన్‌ను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

“పింక్ పాస్ కోసం డిజిటల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్‌వర్క్‌ను మేము ఖరారు చేస్తున్నాము” అని అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయని రవాణా మంత్రి పంకజ్ సింగ్ అన్నారు, అర్హత ధృవీకరణకు ఆధార్ ప్రాథమిక IDగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.

2019లో ప్రవేశపెట్టిన పింక్ టికెట్ పథకాన్ని ఢిల్లీ మహిళలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలు ఉచిత ప్రయాణం నుండి ప్రయోజనం పొందుతున్నారుని రవాణా శాఖ మంత్రి పంకజ్‌సింగ్‌ తెలిపారు.

అయితే, ఈ వ్యవస్థ యొక్క ఓపెన్-యాక్సెస్ స్వభావం దుర్వినియోగమవుతుందని అధికారులు గుర్తించారు. స్థానికేతరులు కూడా ఈ ప్రయోజనాన్ని పొందుతున్నట్లు చెబుతున్నారు. టిక్కెట్ల సంఖ్య పెరగడం, రైడర్‌షిప్ డేటాలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ క్రమంలో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పింక్‌ టికెట్‌ స్థానంలో పింక్‌ పాస్‌ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. పింక్ పాస్ వ్యవస్థను దశలవారీగా ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లోగా పింక్‌ టికెట్ల మీద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు.