‘కోవిడ్‌ 19’ ఆసుపత్రిలో పందుల స్వైరవిహారం.. వీడియో వైరల్‌

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో పందులు స్వైర విహారం చేశాయి. ఒకటి, రెండు కాదు దాదాపుగా 50 పందులు గుంపులుగా ఆసుపత్రిలో తిరుగుతున్నాయి.

కోవిడ్‌ 19 ఆసుపత్రిలో పందుల స్వైరవిహారం.. వీడియో వైరల్‌

Edited By:

Updated on: Jul 19, 2020 | 3:46 PM

కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఓ ఆసుపత్రిలో పందులు స్వైర విహారం చేశాయి. ఒకటి, రెండు కాదు దాదాపుగా 50 పందులు గుంపులుగా ఆసుపత్రిలో తిరుగుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కలాబురాగి జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పందులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా తిరుగుతున్నాయి. అక్కడ డాక్టర్లతో పాటు మిగిలిన వారు ఆ పందులను చూసి చూడనట్లు వదిలేయడం గమనర్హం. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రోగుల పట్ల, శుభ్రత పట్ల ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం మొత్తం  కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఈ వీడియోలో సుస్పష్టంగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 60వేలకు దగ్గర్లో ఉంది. ఇక ఈ వైరస్‌ సోకి కర్ణాటకలో వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు.